Sabarimala Devotees: శబరిమల యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా
ABN, Publish Date - Jan 13 , 2025 | 08:41 AM
సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
సంక్రాంతి సమయంలో శబరిమలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ సంస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది.
శబరిమల సమీపంలోని పథినందిట్ట, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల్లో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్టు ట్రావెన్‌కోర్ సంస్థానం ప్రకటించింది. ఇందుకోసం భక్తుల నుంచి ఎలాంటి రుసమునూ వసూలు చేయడం లేదు. వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ బీమా పథకం వర్తిస్తుంది.
అలాగే శబరిమలలో పని చేసే కార్మికుల కోసం కూడా ట్రావెన్‌కోర్ సంస్థానం బీమా పథకాన్ని ప్రకటించింది. కార్మికులెవరైనా పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ.5 లక్షలు, పూర్తిగా వైకల్యానికి గురైనా, మరణించినా రూ.10 లక్షలు వారి కుటుంబ సభ్యులకు పరిహారంగా అందజేస్తారు. ఈ బీమా కోసం సదరు కార్మికులు రూ.499 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 13 , 2025 | 08:41 AM