Share News

డ్రాయింగ్ బుక్

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:48 AM

దశాబ్దాల క్రితం బాల్యంలో బ్రష్‌ను ముంచి డ్రాయింగ్ బుక్‌లో పచ్చని చెట్లూ గుట్టలూ ఆ పక్క ప్రవహిస్తున్న నదీ...

డ్రాయింగ్ బుక్

దశాబ్దాల క్రితం

బాల్యంలో బ్రష్‌ను ముంచి

డ్రాయింగ్ బుక్‌లో

పచ్చని చెట్లూ గుట్టలూ

ఆ పక్క ప్రవహిస్తున్న నదీ

అందంగా గీసాను

అంతా మెచ్చుకున్నారు

ఇవ్వాళ ఇంట్లో దేనికోసమో

అటక మీదినుంచి

దుమ్ముపట్టిన ఓ పాత ముల్లె తీశాను

విప్పి చూద్దును కదా

అందులో నా చిన్నప్పటి

పాత డ్రాయింగ్ బుక్ కనబడింది

ఉత్సాహంగా పేజీ తిప్పాను

ఎండిపోయిన చెట్లూ

కరిగిపోయిన గుట్టలూ

ఆ పక్కనే పారుతున్న

కన్నీళ్ళూ కనిపించాయి

నా ముఖం వాడిపోయింది

వారాల ఆనంద్


For Telangana News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 12:48 AM