Ravi Mantri : రచయిత పరిశీలన కనపడే రచన నచ్చుతుంది
ABN, Publish Date - Jan 13 , 2025 | 05:18 AM
ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు? కేశవరెడ్డి నవల ‘మునెమ్మ’.
చదువు ముచ్చట
ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?
కేశవరెడ్డి నవల ‘మునెమ్మ’.
ఏ తరహా పుస్తకాల్ని చదవటానికి ఇష్టపడతారు?
నిజ జీవితానికి దగ్గరగా ఉండేవి. ఇది నేను ఎక్కడో చూసాను అనిపించేవి.
మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?
చలం ‘మైదానం’. 17–18 సంవత్సరాల వయసులో చదివాను.
మీ పుస్తకాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?
ఒక వర్గం కోసమో, ఎవరినో చదివించటానికో రాసే కథలు కాక, ఈ రచయిత చాలా పరిశీలన చేసి రాసాడు, జీవితం మీద పట్టు ఉంది అనిపించే కథలు నచ్చటం మొదలుపెట్టాయి.
సాహిత్యంలో మీకు నచ్చిన కల్పిత పాత్ర?
బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలలో దయానిధి.
యండమూరి ‘అనైతికం’ నవలలో అహల్య.
గత కాలం రచయితల్ని కలిసి మాట్లాడగలిగితే ఎవరితో మాట్లాడతారు?
చలం, గొల్లపూడి, యద్దనపూడి.
మీకు తరచుగా గుర్తొచ్చే కొటేషన్/ కవితా పంక్తి?
‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు–
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే...’’
(శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’)
ఎవరైనా సక్సెస్ గురించో, నా విజయాల గురించో మాట్లాడితే
ఈ మాట ఒకసారి నా మైండ్ లోకి వచ్చి వెళ్తుంది. అందుకే నేను దేనినీ తలకి ఎక్కించుకోను.
(రవి మంత్రి మొదటి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ 2023లో విడుదలైంది.)
-రవి మంత్రి
Updated Date - Jan 13 , 2025 | 06:11 AM