Toothbrush: టూత్ బ్రష్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:46 PM
ప్రతి రోజూ మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తుంటాం. ఆఫీసుకు వెళ్లాలనే కంగారులో హడివిడిగా పళ్లు తోమేస్తుంటాం. అనంతరం హోల్డర్‌లో బ్రష్ పెట్టేసి వెళ్లిపోతుంటాం. మళ్లీ తర్వాతి ఉదయం లేచి బ్రష్ చేస్తుంటాం.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు నోరు, పళ్లు శుభ్రం చేసుకునేందుకు సంప్రదాయ పద్ధతులను ఉపయోగించేవాళ్లం. బొగ్గు, వేప పుల్లలతో పళ్లను క్లీన్ చేసుకునేవాళ్లం. అయితే టూత్ పేస్ట్, బ్రష్‌లు భారతీయ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత వాటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. పేస్ట్ తియ్యగా ఉండడం, నురగ వస్తూ సరదాగా అనిపించడంతో చిన్నాపెద్దా అంతా పాశ్చాత్య విధానం వైపే మెుగ్గు చూపారు. అయితే నోరు శుభ్రం చేసుకుని బ్రష్‌లను హోల్టర్‌లో పెడుతుంటాం. అలా పెట్టడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రష్‌ల వల్ల మనకు అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు బ్రష్‌ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రష్‌పై బ్యాక్టీరియా, ఫంగస్..
ప్రతి రోజూ మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తుంటాం. ఆఫీసుకు వెళ్లాలనే కంగారులో హడివిడిగా పళ్లు తోమేస్తుంటాం. అనంతరం హోల్డర్‌లో బ్రష్ పెట్టేసి వెళ్లిపోతుంటాం. మళ్లీ తర్వాతి ఉదయం లేచి బ్రష్ చేస్తుంటాం. ఇది డైలీ రొటీన్‌గా జరిగే వ్యవహారం. అయితే బ్రష్‍ల వల్ల అనేక వ్యాధులు వస్తాయని మీకు తెలుసా. అవును.. ఇది నిజం. ఇదే విషయాన్ని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. మనం బ్రష్ చేసినప్పుడు దానిలోకి నీరు చేరుతుంది. మనం దాన్ని ఆరబెట్టకుండా నేరుగా తీసుకెళ్లి హోల్డర్‌లో పెడుతుంటాం. అప్పుడు తడి, తేమ కారణంగా బ్రష్‌లో హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందుతాయి. నిజం చెప్పాలంటే బ్రష్‌లో లక్షల కొద్దీ బ్యాక్టీరియా ఉంటాయి. తడి కారణంగా అవి మరింతగా వృద్ధి చెందుతాయి.
బ్రష్ హోల్డర్ పైనా..
ప్రతి రోజూ తడి బ్రష్‌ను హోల్డర్‌లో పెట్టడం వల్ల దాంట్లోనూ పెద్దఎత్తున దుమ్ము, ధూళి, బూజు సహా బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటుంది. రెండు, మూడు నెలల తర్వాత కొత్త బ్రష్ అక్కడ పెట్టినా హోల్డర్ క్లీన్ చేయకపోవడం వల్ల దాంట్లోకి సైతం అవి వ్యాపిస్తాయి. అదే బ్రష్‌తో పళ్లు తోముకుంటే హానికరమైన బ్యాక్టీరియా.. గొంతు ద్వారా నేరుగా పొట్టలోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. అందువల్ల బ్రష్‌లను తడి లేకుండా ఆరబెట్టిన తర్వాతే హోల్డర్ లోపల పెట్టాలి.
ఇలా క్లీన్ చేయండి..
బ్రష్, హోల్డర్లను వారానికి ఒకసారి ప్రత్యేకంగా శుభ్రం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం డెంచర్ టాబ్లెట్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ టాబ్లెట్‌లో కొంచెం నీరు కలిపి బ్రష్‌ను అందులో ముంచితే కొన్ని రోజులపాటు బ్యాక్టీరియా టూత్ బ్రష్‌పై లేకుండా పోతుంది. అలాగే వారానికి ఒకసారి బ్రష్ హోల్డర్‌ను శుభ్రం చేయాలి. అనంతరం దాన్ని ఆరబెట్టిన తర్వాత మాత్రమే బ్రష్‌ను అందులో ఉంచాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..
Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..
YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..
Updated Date - Apr 04 , 2025 | 06:51 PM