ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: జ్వరం వచ్చినప్పుడు ఇలా అస్సలు చేయకండి..

ABN, Publish Date - Jan 10 , 2025 | 07:53 PM

జ్వరం, జలుబు, దగ్గు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని కొందరు అంటారు. అయితే, జ్వరం వచ్చినప్పుడు ఏ నీటితో స్నానం చేయడం మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం..

Fever

జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఏ పని చేయలేం. ఎందుకంటే బాడీ అంతా నీరసంగా ఉంటుంది. బెడ్ పై నుంచి లేచి తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే, చాలా మంది జ్వరం, జలుబు, దగ్గు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని కొందరు అంటారు. ఇంకొందరు స్నానం చేసే నీళ్లలో ఉప్పు వేసుకుని స్నానం చేస్తే జ్వరం తగ్గుతుందని అంటారు.

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే చల్లగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు తుమ్ములు మొదలవుతాయి. ఈ సమయంలో వెచ్చని దుప్పటి కింద పడుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అందరూ వెచ్చగా ఉండాలని కోరుకుంటారు. ప్రజలు సాధారణంగా జ్వరం, జలుబు ఉన్నప్పుడు స్నానానికి దూరంగా ఉంటారు. కానీ జలుబు, ఫ్లూకి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అది వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుందని చెబుతున్నారు.


చల్లటి నీటితో స్నానం చేయండి..

  • గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ప్రయోజనకరం. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. కానీ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జ్వరం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చల్లటి నీటితో స్నానానికి దూరంగా ఉండాలి.

  • ఫ్లూ సమయంలో స్నానం చేయడంపై చేసిన కొన్ని అధ్యయనాలు గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల ఫ్లూ లక్షణాలు తగ్గుతాయని తేలింది. ఇది వ్యక్తికి మరింత సుఖంగా ఉంటుంది. కానీ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చలి లేదా శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక పడిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.

  • గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నార్మల్ చేయడంలో సహాయపడుతుంది.

వేడి నీటిలో స్నానం చేయడం మానుకోండి: అధిక జ్వరం వచ్చినప్పుడు వేడి స్నానాలకు దూరంగా ఉండాలి. లేకపోతే, సమస్యలు తీవ్రంగా మారవచ్చు. అలాంటి సమయంలో వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 10 , 2025 | 07:55 PM