ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: చియా విత్తనాలతో వీటిని తీంటే డేంజర్..

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:59 PM

చియా విత్తనాలను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, పొరపాటున కూడా చియా విత్తనాలతో ఈ 5 పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Chia Seeds

చియా విత్తనాలను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, వీటిని కొన్ని ఆహారపదార్థాలతో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో సహా అనేక సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు. ఆయితే, ఏ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందో తెలుసుకుందాం..

పాలు:

పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, చియా గింజలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.

అధిక చక్కెర ఆహారాలు

చియా గింజల పోషక లక్షణాలలో ఉన్న ఒమేగా -3, ఫైబర్.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కానీ, వాటిని స్వీట్లు, బేకరీ ఐటమ్స్ లేదా చక్కెర పానీయాలు వంటి అధిక చక్కెర ఆహారాలతో తింటే, అవి రక్తంలో చక్కెరను పెంచుతాయి. ఇది ఊబకాయానికి దారితీస్తాయి.


ఐరన్ రిచ్ ఫుడ్స్

చియా గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే వాటిని బచ్చలికూర, రెడ్ మీట్, సోయా, పప్పులు వంటి ఐరన్ ఫుడ్‌లతో తినడం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.

క్రూసిఫరస్ కూరగాయలు

బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలలో గోయిట్రోజెన్ అనే మూలకం ఉంటుంది. చియా గింజలతో దీన్ని తినడం వల్ల దాని జీర్ణక్రియ సరిగ్గా జరగదు, ఇది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, చియా గింజలతో కూడిన ఈ ఆహార పదార్థాలను తినడం మానుకోండి.

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అయితే వాటిని ప్రాసెస్ చేసిన మాంసంతో తీసుకోవడం వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 10 , 2025 | 02:58 PM