Obesity: వీటిని తింటే వారంలో స్లిమ్ అవుతారు..
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:11 PM
బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, రాత్రి సమయంలో వీటిని తింటే వారంలో స్లిమ్‌గా మారతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మనం తినే ఆహారంలో పోషకాల లోపం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బరువు పెరుగుతారు. అధిక బరువు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయంతో సహా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటిని తీసుకుంటే వారంలో స్లిమ్‌గా మారడం గ్యారెంటీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవెంటో తెలుసుకుందాం..
ఓట్స్:
రాత్రిపూట ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం మంచిది. దీన్ని పాలు లేదా నీళ్లతో కలుపుకొని తీసుకోవచ్చు. మీరు ఓట్స్‌తో పాటు దోసె, ఇడ్లీని కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమై బరువు తగ్గడానికి సహకరిస్తాయి.
కిచిడి:
బరువు పెరగకుండా నిరోధించే మరో ఆహార పదార్థం కిచిడి. ఇది తింటే త్వరగా జీర్ణమవుతుంది. అలాగే ఇందులో కూరగాయలను జోడించడం వల్ల ఎక్కువ ఫైబర్ కంటెంట్ లభిస్తుంది.
సూప్:
రాత్రిపూట డిన్నర్ చేయడం కన్నా సూప్‌లు తీసుకోవడం మంచిది. కొంతమందికి సూప్ తాగిన తర్వాత కడుపు నిండదు. అలాంటి వారు పచ్చి బఠానీలు, క్యారెట్‌లు, మొక్కజొన్నలను తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండుతుంది. ఇది తేలికగా జీర్ణమై బరువును కూడా తగ్గిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 10 , 2025 | 04:18 PM