Health Tips: ఈ పండు గుండెపోటు రాకుండా చేస్తుంది..
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:12 PM
కొలెస్ట్రాల్ అనేక ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తుంది. అయితే, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఈ పండు ఎంతగానో సహకరిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ పండు ఏంటో, దాని ప్రయోజనాలేంటో ఈ కధనంలో తెలుసుకుందాం..
Avocado Fruit: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. కొలెస్ట్రాల్ మధుమేహం, గుండెపోటుతో పాటు అనేక ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రత్యేక పండు సహకరిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ పండు ఏంటో దాని ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఈ రోజుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ప్రాణాంతకంగా మారుతోంది. సైలెంట్ కిల్లర్ గా మారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిజానికి.. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం పాడవుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీర అభివృద్ధికి..
అవకాడో తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతారు. ఈ అవకాడో ఖరీదైన పండు.. అయితే, ఈ పండును తినే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పెరిగింది. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని చెబుతారు. అవకాడోలో పొటాషియం, విటమిన్లు బి, ఇ, సి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
6 నెలల పాటు..
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. సుమారు 6 నెలల పాటు అవకాడో తినిపించిన పలువురిపై అధ్యయనం నిర్వహించి.. ఈ పండు తిన్న వారి రక్త నమూనాలను పరీక్షించి.. అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. దీంతో ఆ వ్యక్తుల తుంటి, పొట్టలో పేరుకుపోయిన కొవ్వు, రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ తగ్గడంతో మంచి ఆరోగ్యం కోసం ఈ ప్రత్యేకమైన పండును కూడా తినవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 09 , 2025 | 04:13 PM