Sleeping Position: ఇలా అస్సలు నిద్రపోకండి.. ఆరోగ్యానికి ప్రమాదం..
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:33 PM
మనం పడుకునే విధానాన్ని బట్టీ మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? ఎలాబడితే అలా పడుకుంటే ప్రమాదకరం. ఈ కథనంలో సరిగా ఎలా పడుకోవాలో తెలుసుకుందాం.
Sleeping Position: మనిషికి నిద్ర చాలా అవసరం. మనం సరిగ్గా నిద్రపోకపోతే రోజులో అనేక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అని ఎలాబడితే అలా పడుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనంలో సరిగా ఎలా పడుకోవాలి? ఎలా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదో తెలుసుకుందాం.
చాలా మంది వెనుకభాగంలో పడుకోవడం అత్యంత సౌకర్యవంతమైన నిద్ర అని చెబుతారు. అయితే, దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు రక్త ప్రవాహాన్ని మరింత తగ్గిస్తుందని.. ఆక్సిజన్ సరఫరాను నిరోధిస్తుందని చెబుతున్నారు. ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట ప్రాంతంలో అధిక ఒత్తిడి వల్ల అజీర్ణం, అల్సర్లు, గ్యాస్ డిస్టర్బెన్స్ మొదలైన వాటికి కారణమవుతుందని చెబుతున్నారు.
ఈ స్థితిలో పడుకోవడం వల్ల కూడా మెడ, భుజం నొప్పి వస్తుంది. ఇది వెన్నుముక దెబ్బతినడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. గుండె సమస్యలతో బాధపడేవారు ఎప్పుడూ ఈ భంగిమలో పడుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ముఖానికి రక్తప్రసరణ నిలిచిపోయి చర్మం త్వరగా ముడతలు పడి ముసలితనాన్ని సంతరించుకుంటుందని అంటున్నారు.
ఎలా నిద్రపోవాలి:
నిటారుగా లేదా ఎడమవైపు పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గురక సమస్య ఉన్నవారు నేరుగా పడుకోకుండా ఒకవైపు పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బిడ్డ ఆరోగ్యం కోసం గర్భిణీ స్త్రీలు కుడివైపు పడుకోవద్దని, ఎప్పుడూ ఎడమవైపునే పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 09 , 2025 | 01:33 PM