ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sankranti 2025: సంక్రాంతి స్పెషల్.. రుచికరమైన స్వీట్స్ మీ కోసం..

ABN, Publish Date - Jan 13 , 2025 | 02:12 PM

సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి. అలాంటి పండగకు ఇంట్లో స్వీట్స్ లేకపోతే ఎలా. అందుకే ఈ 5 రకాల స్వీట్లను మీ ఇంట్లో సులభంగా తయారు చేసుకోని సంక్రాంతిని సంబరంగా చేసుకోండి..

Sankranti Sweets

సంక్రాంతి వచ్చిందే తుమ్మెత.. సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు గుమగుమలంటున్నాయి. కేవలం పిండి వంటలు మాత్రమే కాదు సంక్రాంతి సందర్భంగా నువ్వులు, బెల్లంతో తయారుచేసిన వంటకాలు తినే సంప్రదాయం కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా నువ్వులు, బెల్లంతో తయారుచేసే ఈ ఐదు రకాల మిఠాయిలను మీ ఇంట్లో సులభంగా తయారుచేసుకోని సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి.


నువ్వుల లడ్డు:

మకర సంక్రాంతి సందర్భంగా నువ్వుల లడ్డును ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. నువ్వులను వేయించి గ్రైండ్ చేసి, తర్వాత బెల్లంతో మిక్స్ చేసి పొడిలా చేసుకోవాలి. కాసేపు తర్వాత ఈ పొడిని లడ్డూలా చేసుకోవాలి.

పల్లీ పట్టి:

పల్లీలు, బెల్లం కలిపి చేసే పల్లి పట్టిని పిల్లలు ఇష్టంగా తింటారు. బెల్లం పాకంతో పల్లీలు జోడించి చేసే చిక్కీలు ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ప్రతి రోజూ ఒకటి తింటే ఆరోగ్యంగా ఉంటారు.

పాలకోవా:

పాలను స్టౌపై మరగబెట్టి, అందులో చక్కెరను వేసి బాగా మరిగించాలి. పంచదార పాకం అయ్యాక స్టౌపైనుండి దింపాలి. వెచ్చగా ఉన్నప్పుడే బిళ్ళలుగా చేసుకోవాలి. ఈ పాలకోవా బయట బజార్లో దొరికే వాటికంటే ఎంతో రుచిగా ఉంటుంది.

కొబ్బరి బెల్లం లడ్డు:

కొబ్బరి పొడి, బెల్లం పాకంతో కలిపి చేసే ఈ లడ్డూ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ లడ్డూ రోజుకి ఒకటి తినడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్ లడ్డు:

జీడిపప్పు, బాదం, పిస్తా వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌ని బెల్లం పాకంలో కలిపి లడ్డులా తయారుచేసుకోవచ్చు. ఈ లడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

Updated Date - Jan 13 , 2025 | 02:12 PM