Health News: వావ్.. పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:43 PM
సాధారణంగా కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పొట్లకాయలో మనుషులకు కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అంతేకాదు.. అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే శక్తి ఈ పొట్లకాయలో ఉందట.. మరి పొట్లకాయ తింటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health News: పొట్లకాయ చాలా మందికి ఫేవరెట్ డిష్. కొందరు మాత్రం ఆ కూర అంటేనే హడలిపోతారు. కానీ, ఈ పొట్లకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నివారించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే.. పొట్లకాయను తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. మరి ఈ పొట్లకాయ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన బహుమతి కూరగాయలు. శరీర పనితీరును మెరుగుపరచడానికి, వ్యాధులను నివారించడానికి సహాయపడే కీలకమైన పోషకాలు ఈ కూరగాయల్లో ఉన్నాయి. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉన్న కూరగాయల్లో పొట్లకాయ ఒకటి. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి ఇది అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తుంది. అంతేకాదండోయ్.. జ్వరం, కామెర్లు ఉన్నవారు పొట్లకాయ గింజలను వేయించుకుని తింటే ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
పొట్లకాయ గింజలు గుండె జబ్బులను నివారించడంలో అద్భుతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. జ్వరం ఉన్నవారు ఈ విత్తనాలు తింటే జ్వరం త్వరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతి నొప్పి, అధిక రక్తపోటు, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజుకు 30 మిల్లీలీటర్ల పొట్లకాయ రసం తాగితే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది. పొట్లకాయం తింటే.. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు సహా ఇతర జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:
బంగారం కొట్టేయడానికి వీళ్లు మామూలు ప్లాన్ వేయలేదుగా..
రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్.. బీజేపీ ఆరోపణ
4 వేల మంది కస్టమర్లకు రెస్టారెంట్ పరిహారం!
For More Health News and Telugu News..
Updated Date - Mar 14 , 2025 | 04:43 PM