Tomatoes Kidney Risk: కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:10 PM
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు తినడం తగ్గిచ్చాలని వైద్యులు చెబుతుంటారు. ఇలా ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: టమాటాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు టమాటాలు తినొద్దన్న సూచన కూడా తరచూ వినిపిస్తుంటుంది. అయితే, టమాటాలతో వచ్చే సమస్యలు ఏమిటనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. దీంతో, ఈ సూచనను పెడ చెవిన పెడుతుంటారు. మరి కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటల జోలికి ఎందుకు వెళ్లొద్దో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాము.
టమాటాలు కిడ్నీకి చేటు చేస్తాయా?
వాస్తవానికి టమాటాల్లో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు స్థూలంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, టమాటాల్లోని కొన్ని రసాయనాల కారణంగా అసౌకర్యం తలెత్తే అవకాశం ఉంది.
టమాటాల్లోని అధిక పొటాషియం కారణంగా హైపర్ కాలేమియా బారిన పడే అవకాశం ఉంది. ఇది చివరకు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
టమాటాల్లోని అధిక ఫాన్ఫరస్ కారణంగా ఎముకలు బలహీన పడతాయి. గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది.
టమాటాల్లోని ఆమ్ల గుణంగా కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అసిడోసిస్ లాంటి సమస్యలు మరింత తీవ్ర మయ్యే ప్రమాదం ఉంది.
టమాటాల కారణంగా శరీరంలో అధికంగా నీరు పేరుకుని వాపు, బీపీ పెరిగే ప్రమాదం ఉంది.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు ఆక్సాలేట్స్ కారణం. ఇవి టమాటాల్లో ఉంటాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వారు టమాటాల జోలికి వెళ్లకుండా ఉంటే ఆక్సాలేట్ స్టోన్స్ ఏర్పడే ముప్పు తగ్గుతుంది.
కిడ్నీ సమస్యలున్న వాళ్లు సాధారణంగా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంటారు. ప్రొటీన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగాఉన్న ఆహారాలు తీసుకుంటారు. అయితే, టమాటాలు తింటే ఇవన్నీ అధిక మొత్తంలో శరీరంలోకి చేరి సమస్యలు మరింత ముదరబెట్టే అవకాశం ఉంది.
ఇక కిడ్నీ సమస్యలున్న వారికి టమాటాలు జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో, శరీరానికి పోషకాలు సరిగా అందవు. దీంతో, జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అంతిమంగా కిడ్నీ సమస్యలు ముదిరేలా చేస్తుంది. కాబట్టి, ఈ అంశాల దృష్ట్యా కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
ఈ సమస్యలు ఉంటే జింక్ లోపం ఉన్నట్టే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి!