Australia tectonic movement: ఆస్ట్రేలియా కదిలొస్తోంది..!
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:55 AM
ఆస్ట్రేలియా ఖండం క్రమంగా ఆసియా వైపు కదులుతున్నందున కోట్ల ఏళ్ల తర్వాత అది భారతదేశానికి పొరుగుదేశంగా మారే అవకాశం ఉంది. ఈ కదలిక వల్ల ఆస్ట్రేలియాలో జీపీఎస్ సమన్వయాల్లో కూడా ఇప్పటికే తేడా వచ్చి కొత్త కోఆర్డినేట్స్‌కి మారాల్సి వచ్చింది.

ఇండియా ఇరుగుపొరుగు దేశాలను ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా పేరు చెబితే ఎలా ఉంటుంది. అదేమిటి ఎక్కడో సముద్రాల మధ్యలో ఉన్న ఆస్ట్రేలియా మనకు పొరుగుదేశం ఏమిటన్న సందేహం వస్తోందా? నిజంగా నిజమే.. కాకపోతే కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత ఆ చాన్స్ రానుంది. ఆస్ట్రేలియా ఖండం ఉన్న టెక్టానిక్ ప్లేట్ మెల్లమెల్లగా ఆసియా ఖండం వైపు కదులుతూ వస్తుండటమే దీనికి కారణం. నిజానికి భూమి ఉపరితలం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నీటిపై తేలుతున్న ఆకుల్లా.. మాగ్మా (ద్రవరూప శిలాద్రవం)పై టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయి. సగటున ఏడాదికి 1.5 సెంటీమీటర్ల వేగంతో ఈ కదలిక ఉంటుంది. అదే ఆస్ట్రేలియన్ ప్లేట్ ఏటా ఏడు సెంటీమీటర్ల వేగంతో కదులుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అత్యంత స్వల్పం కావడం వల్ల మనకు తేడా ఏమీ ఏర్పడదు. కానీ మనం నావిగేషన్ కోసం వినియోగించే జీపీఎ్‌సలో మాత్రం పెద్ద తేడా వచ్చేసింది. ఆస్ట్రేలియా 1994లో గుర్తించిన అక్షాంశ, రేఖాంశాల కోఆర్డినేట్స్‌నే జీపీఎ్‌సలో వాడుతూ వచ్చింది. కానీ 2017లో పరిశీలించినప్పుడు సుమారు ఆరు అడుగుల (1.8 మీటర్లు) తేడా వచ్చింది. అంటే ఆస్ట్రేలియా ఈశాన్య దిశగా అంత దూరం కదిలిందన్న మాట. దీనితో ఆ దేశం జీపీఎస్ కోఆర్డినేట్స్‌ను మార్చుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News