Share News

USA vs China: అమెరికాకు చైనా భారీ ఝలక్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 09:12 AM

నూతన నియంత్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చాక అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లు సహా అనేక కంపెనీలకు సరఫరాలు శాశ్వతంగా నిలిచిపోనున్నట్టు ఆ కథనం పేర్కొంది. రక్షణ రంగం, ఎలక్ర్టిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వినియోగించే 17 రకాల అరుదైన మూలకాలు..

USA vs China: అమెరికాకు చైనా భారీ ఝలక్‌
USA vs China

ఇంటర్నెట్ ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 15: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం పతాకస్థాయికి చేరింది. భూమిలో అరుదుగా లభించే అనేక మూలకాలు, లోహాలతోపాటు అయస్కాంతాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లోని ఆయుధ, ఎలక్ట్రానిక్, విమాన తయారీ, సెమీకండక్టర్‌ కంపెనీలకు కీలకమైన విడిభాగాల కొరత ఏర్పడనుంది. చైనా ప్రభుత్వం ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కార్ల నుంచి క్షిపణుల వరకు అన్ని రకాల తయారీ పరిశ్రమలకు సంబంధించిన అయస్కాంతాలు, ఇతర కీలకమైన విడిభాగాల ఎగుమతులను చైనాలోని అనేక పోర్టుల వద్ద నిలిపివేసినట్టు ది న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. నూతన నియంత్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చాక అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లు సహా అనేక కంపెనీలకు సరఫరాలు శాశ్వతంగా నిలిచిపోనున్నట్టు ఆ కథనం పేర్కొంది.


రక్షణ రంగం, ఎలక్ర్టిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వినియోగించే 17 రకాల అరుదైన మూలకాలు, లోహాల్లో 90% వరకు చైనాయే సరఫరా చేస్తోంది. ఎలక్ర్టిక్‌ కార్లు, డ్రోన్లు, రోబోలు, క్షిపణులు, విమానాలు తదితరాల తయారీలో వినియోగించే అనేక రకాల ఎలక్ర్టిక్‌ మోటార్లలో వీటిని వినియోగిస్తారు. యుద్ధ విమానాల ఇంజన్లు, లేజర్లు, కార్ల హెడ్‌లైట్లు, కొన్ని రకాల స్పార్క్‌ ప్లగ్‌లు, కెపాసిటర్లు, కంప్యూటర్‌ చిప్‌లు, స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే ఎలక్ర్టికల్‌ విడిభాగాల తయారీలోనూ ఈ లోహాలు అవసరం. దశాబ్దాలుగా ఈ కీలకమైన ఖనిజాల కోసం చైనాపైనే ఆధారపడుతున్న అమెరికా తయారీ పరిశ్రమలకు గడ్డు కాలం ఏర్పడనుందని విశ్లేషకులు అంటున్నారు. చైనా తాజా చర్యలు అమెరికాతోపాటు అన్ని దేశాలకూ అరుదైన లోహాల ఎగుమతులను ప్రభావితం చేయనున్నాయి. అరుదైన ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌పై తన ఆధిపత్యాన్ని ఒక ఆయుధంగా మలచుకునే చైనా సామర్థ్యానికి తాజా చర్యలు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read:

135 రోజుల తర్వాత మహిళ శవాన్ని బయటకు తీసి..

శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం...

ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే.. ఏం

For More International News and Telugu News

Updated Date - Apr 15 , 2025 | 09:12 AM