Share News

Israel Hostage Release: ముగ్గురు ఇజ్రాయలీలను విడిచిపెట్టిన హమాస్! దాదాపు 500 రోజుల తరువాత స్వేచ్ఛ

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:53 PM

తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయలీలను హమాస్ ఉగ్ర సంస్థ తాజాగా విడిచిపెట్టింది.

Israel Hostage Release: ముగ్గురు ఇజ్రాయలీలను విడిచిపెట్టిన హమాస్! దాదాపు 500 రోజుల తరువాత స్వేచ్ఛ

ఇంటర్నెట్ డెస్క్: హమాస్ ఉగ్రవాదాలు శనివారం మరో ముగ్గురు ఇజ్రాయలీ పౌరులను విడిచిపెట్టారు. తొలుత వారిని దక్షిణ గాజాలో ప్రజల ముందు ప్రదర్శించిన అనంతరం స్థానిక రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయలీలకు స్వేచ్ఛ లభించిందని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విమరణ ఒప్పందానికి బ్రేక్ పడుతుందని ఆందోళన చెందిన అనేక మందికి తాజా పరిణామం కాస్తంత సాంత్వన చేకూర్చింది. కాగా, హమాస్ చెర నుంచి బయటపడ్డ ముగ్గురికీ తొలుత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ విడిచిపెట్టిన వారిని యెయిర్ హార్న్ (46), సగూయీ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రొఫనావ్ (29)గా గుర్తించారు (Israel).


Blair House: అమెరికాలో ప్రధాని మోదీ విడిది చేసిన ఈ 200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్ గురించి తెలిస్తే..

దాదాపు 500 రోజుల పాటు ఇజ్రాయెల్ చెరలో మగ్గిన వీరు అలసినట్టు ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వైద్య పరీక్షల అనంతరం వారిని బంధువులకు అప్పగించనున్నారు. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై జరిపిన మెరుపు దాడిలో భాగంగా హమాస్ పలువురు ఇజ్రాయెలీ, పాశ్చాత్య దేశస్థులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, గత శనివారం కూడా హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు పురుషులను విడిచిపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొందరు బందీలకు ఇలా స్వేచ్ఛ ఇచ్చింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం కూడా తమ వద్ద బందీలుగా ఉన్న 369 మంది పాలస్తీనా వాసులను హమాస్‌కు అప్పగించింది.


Donald Trump: ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!

కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ తిలోదకాలు ఇస్తాయేమోనన్న భయం అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడుతోంది. ఒప్పంద నియమాల్ని ఉల్లంఘిస్తోందని ఇజ్రాయెల్‌పై ఇటీవల హమాస్ మండిపడింది. బందీల విడుదలలో మరింత జాప్యం చేస్తామని హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ప్రస్తుతం అన్ని వైపుల నుంచి గాజాను చుట్టుముట్టింది. గాజాలోని యుద్ధ బాధితులకు సాయం అందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో గాజాలోకి వైద్య పరికరాలు, ఔషధాలు, తాత్కాలిక నివాసస్థావరాలు, ఇంధనం, ఇతర అవ్యవసర వస్తువులను తక్షణం అనుమతించాలని హమాస్ డిమాండ్ చేసింది. లేకపోతే ఇజ్రాయెల్ బందీల విడుదలలో మరింత జాప్యం జరుగుతుందని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 15 , 2025 | 04:53 PM