Share News

HAL Russia Controvers: రష్యాకు కీలక రక్షణ పరికరాలు

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:43 AM

భారత విదేశాంగ శాఖ రష్యాకు ఆయుధాలు సరఫరా చేసినట్లు న్యూయార్క్ టైమ్స్‌ కథనాన్ని ఖండించింది. హెచ్‌ఏఎల్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ, భారత చట్టాల మేరకు పనిచేస్తుందని తెలిపింది

HAL Russia Controvers: రష్యాకు కీలక రక్షణ పరికరాలు

  • హెచ్‌ఏఎల్‌ ద్వారా చేరాయన్న న్యూయార్క్‌ టైమ్స్‌

  • ఖండించిన భారత విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ, మార్చి 31: రష్యాకు ఆయుధాలు సరఫరా చేసే ఓ నిషేధిత సంస్థకు భారతకు చెందిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) కీలకమైన రక్షణ పరికరాలను విక్రయించిందన్న న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) సోమవారం తీవ్రంగా ఖండించింది. హెచ్‌ఏఎల్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తుందని వివరించింది. అంతేగాక కఠినమైన భారత చట్టాలు, నియంత్రణలను ఏ భారత కంపెనీ అయినా తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలని, కాని న్యూయార్క్‌ టైమ్స్‌ అవేవీ పట్టించుకోలేదని పేర్కొంది. న్యూయార్క్‌ టైమ్స్‌ మార్చి 28న ఈ కథనం ప్రచురించింది. బ్రిటీషు వైమానిక ఉత్పత్తుల సంస్థ హెచ్‌ఆర్‌ స్మిత్‌ గ్రూపు సంస్థ 2 మిలియన్‌ డాలర్ల విలువైన ట్రాన్స్‌మిటర్లు, కాక్‌పిట్‌ పరికరాలు తదితర కీలక రక్షణ పరికరాలను హెచ్‌ఏఎల్‌కు సరఫరా చేసిందని అందులో తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వాటిపై నిషేధం ఉందని అయితే.. అమెరికా, బ్రిటన్‌ నిషేధించిన రష్యన్‌ ఆయుధ తయారీ సంస్థ రొసొబొరొనెక్స్‌పోర్ట్‌కు హెచ్‌ఏల్‌ వాటిని సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. కాగా హెచ్‌ఆర్‌ స్మిత్‌ న్యాయవాది నిక్‌ వాట్సన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. తమ సంస్థ విక్రయాలు చట్టబద్ధమైనవని చెప్పారు. తమ సంస్థ భారత్‌కు సరఫరా చేసిన పరికరాలు సైనిక కార్యకలాపాలకు పనికిరావని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:43 AM