Share News

Katy Perry: అందరూ ఆడవాళ్లే.. అంతరిక్షంలోకి అలా వెళ్లి.. ఇలా వచ్చారు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:27 PM

Katy Perry Brief Foray Into Space: ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీతో పాటు మరో ఐదుగురు మహిళలు అంతరిక్షపు సరిహద్దు వరకు వెళ్లి వచ్చారు. కేవలం 10 నిమిషాల ఈ ప్రయాణం కోసం అమెజాన్‌కు చెందని బ్లూ ఆరిజిన్ కంపెనీ 2 నుంచి 3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

Katy Perry: అందరూ ఆడవాళ్లే.. అంతరిక్షంలోకి అలా వెళ్లి.. ఇలా వచ్చారు..
Katy Perry Into Space

డబ్బులు ఉంటే ఏదైనా చేయోచ్చు అనడానికి పాప్ స్టార్ కేటీ పెర్రీ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ఆమె ఏకంగా 2 కోట్ల 65 లక్షలకు పైగా ఖర్చు చేసింది. అంత ఖర్చు పెట్టి కేవలం పది నిమిషాల్లోనే అంతరిక్షంలోకి వెళ్లి.. భూమ్మీదకు తిరిగి వచ్చింది. అమెజాన్ కంపెనీ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ఓ స్పేస్ క్రాఫ్ట్‌లో కేటీ పెర్రీతో పాటు మరో ఐదుగురు మహిళలు అంతరిక్షయాణం చేశారు. ఆ ఆరుగురిలో కేటీ పెర్రీతో పాటు ఐశా బోవే, అమాండా గ్యుయెన్, గేల్ కింగ్, కరియాన్నే ఫ్లైన్.. జెఫ్ ప్రియురాలు లారెన్ సాంచెజ కూడా ఉంది. ఈ ఆరుగురు సోమవారం ఉదయం అంతరిక్ష ప్రయాణాన్ని మొదలెట్టారు.


ఉదయం 8.30 గంటల ప్రాంతంలో టెక్సాస్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ గాల్లోకి ఎగిరింది. అత్యంత వేగంగా 100 కిలో మీటర్ల ఎత్తులోకి వెళ్లింది. అంతరిక్ష సరిహద్దులను తాకింది. ఆ వెంటనే కిందకు వచ్చేసింది. మొత్తం పది నిమిషాల్లో ఈ ప్రయాణం ముగిసింది. అందరూ క్షేమంగా భూమ్మీదకు అడుగు పెట్టారు. కేటీ పెర్రీ భూమ్మీదకు క్షేమంగా తిరిగిరాగానే.. నేలను ఎంతో ఆప్యాయంగా ముద్దాడింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ నా మీద నాకు ఎంత ప్రేమ దాగుందో.. మనల్ని మనం ఎంత ప్రేమించాలో.. ఈ ప్రయాణం నాకు తెలిసేలా చేసింది. ’ అని పేర్కొంది. కేటీ పెర్రీ మట్టిని ముద్దాడుతున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇదే మొదటి మిషన్

అంతరిక్షంలోకి మొత్తం మహిళలతో కూడిన బృందం వెళ్లి రావటం ఇదే మొదటి సారి. 1963లో రష్యాకు చెందిన ఓ మహిళా ఇంజనీర్ ఒంటరిగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడిలా ఆరుగురు మహిళలు కలిసి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చి రికార్డు సృష్టించారు. అమెజాన్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ గత కొన్నేళ్లుగా మనుషుల్ని అంతరిక్షపు సరిహద్దుల వరకు తీసుకెళుతోంది. 11వ ట్రిప్‌లో భాగంగా ఆ ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లి, వచ్చారు. బ్లూ ఆరిజిన్ కంపెనీ ఈ ట్రిప్ కోసం రెండు కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి అమెజాన్ ఎలాంటి అధికారిక ప్రకటనల్ని విడుదల చేయలేదు.


ఇవి కూడా చదవండి

Saif Ali Khan: ఇది అస్సలు ఊహించలే.. సైఫ్‌ అలీఖాన్‌ కేసులో ట్విస్ట్‌

Robert Vadra: ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. ఆ స్కామ్‌లో అరెస్ట్ చేస్తారా..

Updated Date - Apr 15 , 2025 | 12:35 PM