ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trump : 'గల్ఫ్ ఆఫ్ అమెరికా' వ్యాఖ్యలపై.. ట్రంప్‌కు మెక్సికన్ అధ్యక్షురాలి కౌంటర్..

ABN, Publish Date - Jan 09 , 2025 | 10:32 AM

'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..

Trump VS Mexico President Claudia

అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టక మునుపే భూవిస్తరణ కాంక్షతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్.. అధికారంలోకి రాగానే పొరుగుదేశం కెనడాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై అమెరికా జెండా ఎగురుతున్నట్లుగా ఉన్న మ్యాప్‌ల ఫొటోలను విడుదల చేశారు. డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి దేశాలైన గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువలను విలీనం చేసుకుంటామని అనడంతో ఆయా దేశాలతో కయ్యానికి కాలు దువ్వినట్లయింది. 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మారుస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మెక్సికో, అమెరికా దేశాల మధ్య అగ్గి రాజుకుంది. తాజాగా ట్రంప్ కామెంట్స్‌పై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించింది. 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా' అనే బదులు 'మెక్సికన్ అమెరికా' అని మేం పిలిస్తే తప్పేముందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ చురకలంటించింది.


తమ దేశంలోకి అక్రమ వలసలు, మాదకద్రవ్యాల రవాణా అడ్డుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మెక్సికోను హెచ్చరించాడు ట్రంప్. అధికారంలోకి రాగానే 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చేస్తానని అన్నాడు. మెక్సికో పేరును మార్చి అమెరికాలో కలుపుకుంటామనని చెప్పడంతో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ధీటుగా స్పందించింది. మీడియా సమావేశంలో మ్యాప్‌ని చూపిస్తూ 17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాను 'మెక్సికన్ అమెరికా' అనే పిలిచేవారని గుర్తుచేసింది. ఇదే పేరుతో ఇప్పుడూ పిలిస్తే వినడానికి చాలా బాగుంటుంది కదా? అని వ్యంగ్య స్వరంతో కౌంటర్ ఇచ్చింది. ట్రంప్‌ని ఉద్దేశిస్తూ ఐక్యరాజ్యసమితి కూడా 'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును ఎప్పుడో గుర్తించిందనే విషయం మర్చిపోవద్దని సూచించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.


ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్.. ఈ మధ్య తరచూ రాజ్య విస్తరణ కాంక్షను బయట పెడుతున్నాడు. డెన్మార్క్ డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి దేశాలైన గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువలను విలీనం చేసుకుంటామని అనడంపై.. ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఐరోపా సమాఖ్య. ఐరోపా దేశాల జోలికొస్తే ఊరుకోమని స్పష్టంచేసింది. దీంతో అంతర్జాతీయంగా స్థాయిలో పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తమవుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ తలపడని అగ్రదేశాల మధ్య తగవు మొదలవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 10:32 AM