Hasina Slams Yunus: నిప్పుతో చెలగాటమాడితే దహించి వేస్తుంది
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:42 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూన్‌సను నిప్పుతో చెలగాటమాడే వ్యక్తిగా వర్ణించి విదేశీ శక్తులతో చేతులు కలిపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు స్వాతంత్య్ర సమరయోధులపై అవమానాలు జరుగుతున్నాయంటూ ఆయనను నిలదీశారు

యూన్‌సకు షేక్ హసీనా హెచ్చరిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ‘‘మీరు నిప్పుతో చెలగాటమాడితే.. ఆ నిప్పే మిమ్మల్ని దహించి వేస్తుంది’’ అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూన్‌సను హెచ్చరించారు. తన అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మహమ్మద్ యూనస్ విదేశీ శక్తులతో చేతులు కలిపారని, బంగ్లాదేశ్ పతనానికి కుట్ర చేశారని ఆరోపించారు. యూన్‌సను ఆమె ‘అత్యంత దురాశాపరుడైన వడ్డీవ్యాపారి’గా అభివర్ణించారు. సోమవారం హసీనా తన పార్టీ(అవామీ లీగ్) కార్యకర్తలను ఉద్దేశించి 8నిమిషాల పాటు వర్చువల్‌గా ప్రసంగించారు. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం చరిత్రను చెరిపేస్తోందని హసీనా అన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తున్నారు. యూనస్ దీన్ని ఎలా సమర్థించుకుంటారు’’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..