USA-China Fight: అమెరికన్లపై చైనీస్ మీమ్స్.. నవ్వితీరాల్సిందే
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:55 PM
చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి మనుష్యులు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.

China - America Tariff Effects: అగ్రరాజ్యం అమెరికాలో వస్తువుల మాన్యుఫాక్చరింగ్ చాలా తక్కువన్నది తెలుసుకదా.. అమెరికన్లు చాలా వరకు తమకు కావలసిన వస్తువుల్ని ప్రపంచంలోని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అంటూ ఊదరగొడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రపంచదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీ సంఖ్యలో సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే. తద్వారా అమెరికాకు వస్తువుల్ని ఎగుమతి చేసే కంపెనీలు చాలా వరకూ అమెరికా వచ్చి పరిశ్రమలు పెడతాయని తద్వారా అమెరికాలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ఊకదంపుడు ప్రసంగాలిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో చైనా, అమెరికా దేశాలు ఒకరిపై ఒకరు పోటాపోటీ దిగుమతి సుంకాలు విధించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి ప్రజలు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. శారీరక కష్టం వాళ్లకు పెద్దగా పడదు.. భారీకాయంతో వాళ్లు ప్రొడక్షన్లో ఉంటే ఎలా ఉంటుందో చైనాలో మీమ్స్ చేస్తూ నెట్టింట్లో వదులుతున్నారు. అలాంటి ఒక వీడియో ఇది.. ఇది చూస్తే తప్పక నవ్వాల్సిందే.