Bus Accident: ట్రావెల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 41 మంది మృతి
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:55 AM
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సు నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారితోపాటు డ్రైవర్ సహా 41 మంది సజీవ దహనమయ్యారు.

మెక్సికో(Mexico)లోని దక్షిణ ప్రాంతంలో కాంకున్ నుంచి టబాస్కోకు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ రోడ్డు ప్రమాదంలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. 48 మంది వ్యక్తులతో బస్సు కాంకున్ నుంచి టబాస్కో మధ్య ప్రయాణిస్తుండగా శనివారం తెల్లవారుజామున ఎస్కార్సెగా నగరానికి సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రావెల్ బస్సును ట్రక్కు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 41 మంది సజీవదహనం చెందారని అధికారులు తెలిపారు.
మేయర్ స్పందన
ఈ ప్రమాదంపై టాబాస్కోలోని కమల్‌కాల్కో మేయర్ ఒవిడియో పెరాల్టా స్పందించారు. కాంకున్ నుంచి టబాస్కోకు వెళుతున్న బస్సు ప్రమాదం ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాధితుల కుంటుంబాలకు సహాయం అందించడానికి అవసరమైన సాయం చేస్తామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యవసర సేవలను అందిస్తున్నామని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామన్నారు.
ప్రమాదం నేపథ్యంలో..
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు స్పీడ్ లిమిట్‌లో ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, కానీ బస్సు ఆపరేటర్ ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదానికి గల మరిన్ని కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం, స్థానిక అధికారులు బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి స్థానిక ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రజలు ఈ ప్రమాదం కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: వచ్చే వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 09 , 2025 | 11:18 AM