Share News

Trumps Bold Economic Claims: అంతా బ్రహ్మాండంగా ఉంది

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:54 AM

ప్రపంచ మార్కెట్లలో తీవ్ర వర్గీకరణ మధ్య, చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గడం, మరియు ట్రంప్‌ అన్నింటికీ ద్రవ్యోల్బణం లేదని పేర్కొన్నారు. చైనాపై ప్రతీకారంగా అదనపు సుంకం విధించాలనే ఆయన ఉద్దేశం ఉంది

Trumps Bold Economic Claims: అంతా బ్రహ్మాండంగా ఉంది

చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి.. అసలు ద్రవ్యోల్బణమే లేదు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 7: అమెరికా ప్రతీకార సుంకాల దెబ్బకు ఒకపక్క ప్రపంచమార్కెట్లన్నీ దారుణంగా పతనమై.. మదుపర్లకు రూ.లక్షల కోట్ల నష్టం వచ్చి ‘బేర్‌’మంటున్నారు! మరోవైపు.. ఈ సుంకాల వల్ల వాణిజ్య యుద్ధం జరిగి, ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా ఇంత కలవరపడుతున్నా.. ట్రంప్‌ మాత్రం ‘అంతా బానే ఉంది’ అంటూ తాపీగా తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్టు పెట్టారు. ‘‘చమురు ధరలు తగ్గాయి. వడ్డీరేట్లు తగ్గాయి. ఆహార ధరలు తగ్గాయి. అసలు ద్రవ్యోల్బణమే లేదు. అన్నింటికీ మించి.. దీర్ఘకాలంగా అమెరికాను మోసం చేస్తున్న దేశాల నుంచి సుంకాల రూపంలో గత వారంరోజులుగా బిలియన్ల కొద్దీ డాలర్లు వస్తున్నాయి’’ అని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు. అందునా ఇన్నాళ్లుగా అమెరికాను అధిక సుంకాలతో దోచుకున్న చైనా మళ్లీ తన సుంకాలను 34 శాతం మేర అధికంగా పెంచిన తర్వాత కూడా అమెరికాకు ఇంత మంచి జరుగుతోందని పేర్కొన్నారు. అమెరికా మంచితనాన్ని అలుసుగా తీసుకుని చైనా దశాబ్దాలుగా ఇలా సుంకాలను దుర్వినియోగం చేస్తోందన్న ఆయన.. దీనికి కారణం గత పాలకులేనని విమర్శించారు.


ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకుంటే.. చైనాపై 50% అదనపు సుంకం

అమెరికా విధించిన ప్రతీకార సుంకానికి స్పందనగా.. తాము కూడా అమెరికన్‌ ఉత్పత్తుల దిగుమతులపై 34% సుంకం విధిస్తున్నట్టు చైనా చేసిన ప్రకటనపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘చైనా గనక తాజాగా మాపై విధించిన ఆ 34% అదనపు సుంకాన్ని మంగళవారంలోగా ఉపసంహరించుకోకుంటే.. చైనాపై బుధవారం నుంచి వర్తించేలా, ఇప్పుడున్నదానికి అదనంగా మరో 50% సుంకాన్ని అమెరికా విధిస్తుంది. అంతేకాదు.. మాతో చైనా అభ్యర్థన మేరకు ఆ దేశంతో చేస్తున్న చర్చలన్నింటినీ పూర్తిగా రద్దుచేస్తాం’’ అని ట్రంప్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:54 AM