Trumps Iran Ultimatum: అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే బాంబులేస్తా
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:47 AM
ట్రంప్ ఇరాన్ పై కొత్త అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే బాంబులు పడతాయని హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రత్యక్ష చర్చలకు నిరాకరించడంతో, ట్రంప్ 2 నెలల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని అంగీకరించారు

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్, మార్చి30: కొత్త అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కొత్త అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రత్యక్ష చర్చలకు రావాలంటూ ట్రంప్ లేఖ ద్వారా ఇచ్చిన ఆహ్వానాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తిరస్కరించారు. ప్రత్యక్ష చర్చలకు ఒప్పుకోబోమని, ఒమన్ వేదికగా పరోక్ష చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎన్‌బీసీ సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఇరాన్‌ను హెచ్చరించారు. రెండు నెలల్లోగా ఇరాన్ కొత్త అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేకపోతే తర్వాత జరగబోయే పరిణామాలను ఎవ్వరూ ఊహించలేరని చెప్పారు. వాస్తవానికి 2015లో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం 2018లో తప్పుకుంది. తాజాగా అణ్వాయుధాల తయారీపై ఇరాన్ చురుగ్గా ఉందనే కథనాల మధ్య ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.
పుతిన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
ఉక్రెయిన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయకుంటే రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. రష్యా చమురుపై సుంకాలు పెంచుతామని, ఆ దేశం వద్ద చమురు కొనే దేశాలు అమెరికాతో వ్యాపారం చేయకుండా కట్టడి చేస్తామన్నారు. ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ ఊసులేని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు పుతిన్ పిలుపునీయడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది
ఇవి కూడా చదవండి:
Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర
UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ