Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:18 AM
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలు ఇప్పటికీ 104 శాతానికి చేరుకున్నాయి. ప్రతీకార చర్యలపై చైనా హెచ్చరిస్తున్నా.. ట్రంప్ వెనక్కి తగ్గకుండా అదనపు 50 శాతం సుంకాలు విధించారు.

వాషింగ్టన్, ఏప్రిల్ 8: చైనాపై ట్రంప్ సుంకాల బాదుడు 104 శాతానికి చేరుకుంది! డ్రాగన్ దేశంపై తొలుత 20 శాతం.. ఆ తర్వాత మరో 34 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆ దేశం తమపై 34ు మేర ప్రతీకార సుంకం విధించడాన్ని తట్టుకోలేకపోయారు. ఒక్కరోజులోగా ఆ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోవాలని.. లేకుంటే తాను చైనాపై అదనంగా 50ు సుంకాన్ని విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అయితే, ట్రంప్ బెదిరింపులకు చైనా తలొగ్గలేదు. పైగా.. ఇలాంటి బెదిరింపులకు తాము లొంగబోమని, అమెరికాతో తుదికంటా పోరాడుతామని, తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతీకారచర్యలు తీసుకుంటామని తెగేసి చెప్పింది. దీంతో చైనాపై 50ు అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు