Share News

US Immigration Update: ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులో ఇక నుంచి రెండు జెండర్లే

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:47 AM

ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల్లో ఇకపై స్త్రీ లేదా పురుషులే గుర్తించబడతారు. 2023లో ప్రవేశపెట్టిన ఇతర జెండర్ ఎంపికను తొలగించి, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా లింగాన్ని గుర్తించనుంది

US Immigration Update: ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులో ఇక నుంచి రెండు జెండర్లే

‘ఇతర జెండర్‌’ ఆప్షన్‌ తొలగింపు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 4: ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తుల్లో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సేవల (యూఎస్ సీఐఎస్‌) సంస్థ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై దరఖాస్తుల్లో స్త్రీ లేదా పురుషులను మాత్రమే గుర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మార్పు ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 2023లో బైడెన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇతర జెండర్‌’ ఎంపిక అవకాశాన్ని తొలగించినట్లయింది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో యూఎస్ సీఐఎస్‌ ఈ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. లింగనిర్ధారణకు బర్త్‌ సర్టిఫికెట్‌ లేదా దానికి సమానమైన ధ్రువీకరణను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూఎస్ సీఐఎస్‌కు ప్రభుత్వం సూచించింది.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:47 AM