Share News

Chanakya Niti on Marriage: బీ కేర్ ఫుల్.. ఇలాంటి స్త్రీ ఎప్పుడైనా తమ భర్తను విడిచిపెట్టవచ్చు..

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:15 PM

ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే జీవితమంతా కష్టాలతో నిండిపోతుందని చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి స్త్రీలు మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని లేదా శాంతిని ఇవ్వలేరని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదని సూచిస్తున్నాడు.

Chanakya Niti on Marriage: బీ కేర్ ఫుల్.. ఇలాంటి స్త్రీ ఎప్పుడైనా తమ భర్తను విడిచిపెట్టవచ్చు..
Chanakya Niti on Marriage

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా పేరు పొందాడు. తన జీవితకాలంలో ఆయన అనేక రకాల విధానాలను రచించాడు. వాటినే మనం చాణక్య నీతి అని పిలుస్తాము. చాణక్యుడు తన విధానాలలో అనేక విషయాల తోపాటు కొందరి మహిళల గురించి ప్రస్తావించాడు. ఈ మహిళల గురించి మాట్లాడుతూ, మీరు ఎట్టిపరిస్థితిలోనూ ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదని సూచించారు. మీరు ఈ స్త్రీలను వివాహం చేసుకుంటే, మీ జీవితమంతా కష్టాలతో నిండిపోతుందని, అలాంటి స్త్రీలు మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని లేదా శాంతిని ఇవ్వలేరని పేర్కొన్నారు. చాణ్యుకుడు చెప్పిన ఆ మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


చెడ్డ కుటుంబం నుండి

ఆచార్య చాణక్యుడి ప్రకారం, మీరు ఎప్పుడూ చెడ్డ కుటుంబానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆమె అందంగా ఉండి, ఆమె కుటుంబం మంచిగా లేకుంటే, అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో తరువాత చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

కుటుంబాన్ని గౌరవించని వ్యక్తి

కుటుంబాన్ని గౌరవించని అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లయితే లేదా వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీరు వెంటనే వెనక్కి తగ్గాలి. ఇలాంటి అమ్మాయిలు తమ భర్తలకు నమ్మకంగా ఉండలేరు, వారిని గౌరవించలేరు.

చెడుగా ప్రవర్తించే స్త్రీ

ఒక అమ్మాయి చాలా అందంగా ఉండి, మీ పట్ల ఆమె ప్రవర్తన బాగా లేకుంటే, మీరు ఆమెను వివాహం చేసుకోకూడదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, అలాంటి అమ్మాయిలు ఎప్పుడైనా తమ భర్తలను విడిచిపెట్టవచ్చు.

పూజించని స్త్రీ

ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్త్రీ తరచూ ఉపవాసం ఉండి, దేవుడిని పూజించాలి. ఒక స్త్రీకి ఈ లక్షణాలు లేకపోతే మీరు ఆమెను ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు.

చెడుగా ఆలోచించే స్త్రీ

చాణక్య నీతి ప్రకారం, ఒక స్త్రీ బయటి నుండి ఎంత అందంగా ఉన్నా, ఆమెకు మంచి మనసు లేకుంటే లేదా ఆమె ఆలోచనలు మంచివి కాకపోతే, మీరు ఆమెను వివాహం చేసుకోకూడదు.


Also Read:

US-AP Online Love: హద్దుల్లేని ప్రేమ.. ప్రియుడి కోసం అమెరికా నుంచి ఆంధ్రాకు

Pawan Kalyan: మార్క్ శంకర్‌కు అత్యవసర వార్డులో చికిత్స...

ట్రంప్ భయంకర నిర్ణయాలు .. భూతల నరకంగా అమెరికా

Updated Date - Apr 09 , 2025 | 01:23 PM