Oily Skin Tips: జిడ్డు చర్మం బాధిస్తోందా.. ఉదయాన్నే ఇలా చేస్తే కొత్త మెరుపు మీ సొంతం..
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:18 PM
Oily Skin Hacks Summer: జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ కాలాల్లోనే చర్మ సంరక్షణ కోసం నానాతంటాలు పడుతుంటారు. ఇక వేసవిలో చెమట వల్ల చర్మం మరింత జిగటగా మారి విసుగు తెప్పిస్తుంది. అయినా, ఏ భయం లేదు. ఉదయాన్ని ఈ చిన్నపాటి చిట్కాలు పాటించారంటే రోజంతా ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.

Summer Beauty Tips for Oily Skin: వేసవికాలంలో చర్మం మరింత జిగటగా మారుతుంది. చెమట, సెబమ్ ఉత్పత్తి పెరగడం ఒక కారణమైతే.. చర్మ రంధ్రాలు తెరుచుకోవడం వల్ల చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. ముఖాన్ని పదే పదే శుభ్రం చేసినప్పటికీ జిడ్డు తొలగిపోదు. ఈ అలవాటు వల్ల క్రమంగా సెబమ్ చర్మ రంధ్రాలలో పేరుకుపోవడం ప్రారంభమై చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమల సమస్యలను మరింత పెంచుతుంది. దీనికి తోడు దుమ్మూధూళి, మేకప్ వంటివి తోడైతే చర్మ రంధ్రాలను పూర్తిగా మూసుకుపోయి స్కిన్ నిస్తేజంగా, నల్లబడినట్లు అయిపోతుంది. తీవ్ర చర్మ సమస్యలు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే ఉదయం ఈ 5 చర్మ సంరక్షణ చిట్కాలు పాటించి వేసవిలో జిడ్డు చర్మాన్ని వదిలించుకుని మచ్చలేని గ్లోయింగ్ స్కిన్ పొందండి.
1. పచ్చి పాలు
ఎక్స్‌ఫోలియేషన్ కోసం ముఖానికి పచ్చి పాలను రాయడం చాలా మంచిది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ముఖంపై ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి పాలలో కొద్దిగా ఉప్పు కలిపి ముఖాన్ని మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మిల మిలా మెరిసిపోతుంది.
2. పెరుగు
ముఖానికి పెరుగు రాయడం వల్ల చర్మం జిగట తగ్గుతుంది. ఇది చర్మానికి పోషణనివ్వడంతో పాటు పూర్తిగా శుభ్రపరుస్తుంది. సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి ముఖంపై పేరుకుపోయిన మృతకణాల పొరను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
3. తేనె
చర్మం జిగటను తగ్గించడానికి మీరు తేనెతో కూడా చర్మాన్ని మసాజ్ చేయవచ్చు. ఇది ముఖంపై పేరుకుపోయిన జిగటను తగ్గిస్తుంది. తేనెలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే బ్యాక్టీరియా, మొటిమల వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. తేనెతో మీ ముఖాన్ని మసాజ్ చేసి ఆపై చల్లని లేదా గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోండి.
4. దోసకాయ
దోసకాయ రసం ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం జిగట కూడా తగ్గుతుంది. దోసకాయ పేస్ట్ ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి.
5. టమోటా గుజ్జు
టమాటా గుజ్జును ముఖానికి పూయడం వల్ల చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా చర్మానికి మెరుపు వస్తుంది. టమాటా చర్మం జిడ్డును, ముడతలు పోయి పర్‌ఫెక్ట్ గ్లోయింగ్ స్కిన్ రావడం ఖాయం.
గమనిక : ప్రియమైన పాఠకులారా! ఈ వ్యాసం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి, మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.
Read Also: Summer Fruits: సమ్మర్‌లో ప్రతిరోజూ ఈ 7 పండ్లు తినండి.. సన్ ట్యానింగ్‌కు బై బై చెప్పండి..
Snake Bite: పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే