Bhagavad Gita Lesson: ఈ 4 విషయాలపై అవగాహన ఉంటే.. జీవితం సుఖమయం..
ABN , Publish Date - Apr 08 , 2025 | 09:05 AM
Bhagavad Gita Lesson: మనం ఎంతో కష్టపడి అందంగా, అపురూపంగా నిర్మించుకున్న బంధం కుప్పకూలిపోతుంటి నరకంలా అనిపిస్తుంది. ప్రాణం పోతున్నట్లు ఉంటుంది. అయ్యో.. నా అనుకున్న వాళ్లు దూరం అవుతున్నారే అన్న బాధ నిరంతరం వేధిస్తుంది. గుర్తు పెట్టుకో.. జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్లుగా ఉండదు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి
భగవద్గీతలోని ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని, ఆచరిస్తే చాలు. జీవితం సాఫీగా సాగుతుంది. పనులు చేయటం వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్నుంచి వచ్చే ఫలితానికి మనతో ఎటువంటి సంబంధం లేదు. మనం ఎవరినైనా ప్రేమిస్తే.. వాళ్ల కోసం ఏదైనా చేస్తే.. తిరిగి ఆశించకూడదు. వాళ్లు మనతో ఎందుకు ప్రేమగా ఉండటం లేదని బాధపడకూడదు. ప్రాణంగా ప్రేమించిన రాధ దూరం అయినపుడు కృష్ణుడు చాలా బాధపడ్డాడు. ఆయనకు తెలుసు.. కర్మలను మాత్రమే తాను ఆచరించగలనని.. ఫలితం దేవుడినైన తన చేతుల్లోకూడా లేదని. మనం గనుక జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ఈ 4 విషయాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.
1) బాధలకు కారణం అటాచ్‌మెంట్
మనిషికి ఉన్న అతి పెద్ద శత్రువల్లో అటాచ్‌మెంట్ ప్రధానమైనది. మనుషులకు అటాచ్ అవుతాం.. ప్రదేశాలకు అటాచ్ అవుతాం.. ఆఖరికి వస్తువులకు కూడా అటాచ్ అవుతాం. ప్రేమ శాశ్వతం అనుకుంటాం.. సక్సెస్ శాశ్వతం అనుకుంటాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషుల్ని, మనసుల్ని మార్చేస్తుంది. మనం పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతాయి. అప్పుడు వెక్కి వెక్కి ఏడ్వాల్సి వస్తుంది. ఈ బాధ కలిగేది వాళ్లు మనల్ని వదిలివెళ్లిపోయినందుకు కాదు.. వాళ్ల మీద మనం పెంచుకున్న అటాచ్‌మెంట్ కారణంగా.
2) కంట్రోల్ చేయటం
జీవితం అన్నది ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండదు. మనం గతంలో జరిగినదాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటాం. లవ్‌లో ఫెయిల్ అయితే.. ఇంకో సారి ప్రేమ జోలికి వెళ్లకూడదని అనుకుంటాం. కానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మళ్లీ ప్రేమలో పడతాం. రెండోసారి ప్రేమలో పడ్డప్పుడు మోసపోతామేమోనన్న భయంతోనే గడిపేస్తాము. ఎదుటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. ఉంటారా? పోతారా? అన్న అనుమానంతో మనం బాధపడుతూ.. వాళ్లను కూడా బాధపెడుతూ ఉంటాం.
3) ఎవ్వరూ మన సొంతం కాదు
మనం ఎవరినైనా మనస్పూర్తిగా ప్రేమించామనుకోండి. వాళ్లకు ఎందులోనూ లోపం రాకుండా చూసుకున్నాం అనుకోండి. వారెప్పటికీ మనల్ని వదిలిపెట్టి పోరని అనుకుంటాం. ఇదే పెద్ద పొరపాటు. మనం నూటిని నూరు శాతం ప్రేమిస్తే.. వాళ్లు కూడా అంతే ప్రేమించాలనుకోవటం.. మనతో పాటు కలిసి ఉండాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ప్రేమించినంత మాత్రాన ఎదుటి వ్యక్తిపై మనకు సర్వ హక్కులు రావు. నువ్వు ప్రాణం పెట్టి ప్రేమించినా.. విజయ దక్కటం అన్నది అత్యంత అరుదైన విషయం.
4) తర్వాత ఏంటి?
మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా.. ఎవరినైనా కోల్పోతాం అన్న భయం కలిగినపుడు ఓ సారి ఆలోచించండి. వాళ్లను మనతో పాటు ఎల్లకాలం ఉంచుకోవడానికి వాళ్లు మన సొంతమా?. మనకు మనమే సొంతం.. శాశ్వతం కానప్పుడు.. ఇతరుల గురించి అంత బాధపడ్డం ఎందుకు?.. కాలంతో పాటు గాలిలా అన్నిటినీ మోస్తూ బతకటమే మానవ జీవితం.
ఇవి కూడా చదవండి:
రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి