Dust Cleaning Tips: క్లీన్ చేసిన తర్వాతా వస్తువులపై దుమ్ము కనిపిస్తోందా.. ఈ ట్రిక్‌తో..
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:29 PM
How to get rid of dust from home: వేసవి కాలంలో పొడి వాతావరణం కారణంగా గాల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కూడా ఫ్లోర్, గృహోపకరణాలపై దుమ్ము పేరుకుపోయినట్లే కనిపిస్తుంది. ఈ సమస్య తొలగిపోవాలంటే..

Summer Dust Cleaning Tips: ఎండా కాలంలో అధిక వేడి కారణంగా వాతావరణంలో దుమ్ము వేగంగా ఎగురుతుంది. దీనివల్ల మిగతా సీజన్ల కంటే వేసవిలో ఇంట్లో ప్రతి మూలా దుమ్ము అధికంగా కనిపిస్తుంది. టేబుల్స్, టీవీ, ఫ్రిజ్, కూలర్స్, షో పీస్ ఇలా ప్రతి వస్తువునూ శుభ్రంగా తుడిచినప్పటికీ మరుసటి రోజు వెంటనే దుమ్ము దర్శనమిస్తుంది. ఇలాంటప్పుడు ఇంటిని శుభ్రపరిచే పని కష్టమవుతుంది. మీకు కూడా ఈ సమస్య ఎదురవుతోందా.. అయితే, దుమ్మును శుభ్రంగా వదలగొట్టేందుకు ఈ పద్ధతిని అనుసరించండి. దీనివల్ల వస్తువులపై దుమ్ము త్వరగా పేరుకుపోదు. వారం మొత్తం ఇల్లు శుభ్రంగా కనిపిస్తుంది.
కండిషనర్ తో ఇంటిని శుభ్రం చేయండి
వేసవిలో మంచం, టేబుల్, వార్డ్‌రోబ్ ఇలా రకరకాల వస్తువులు దుమ్ముతో నిండిపోయినట్లు కనిపిస్తే ఈ రెండు వస్తువులను నీటిలో కలిపి శుభ్రం చేయండి. ఒక టబ్ లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక చెంచా ఉప్పు, రెండు మూడు చుక్కల కండిషనర్ కలపండి. దీన్ని బాగా కలిపి ఈ మిశ్రమంలో ఒక గుడ్డను ముంచి పిండేయండి. తర్వాత మంచం నలువైపులా, టేబుల్స్, వార్డ్‌రోబ్, చెక్క, గాజు వస్తువులను తుడిచి శుభ్రం చేయండి. ఇలా చేస్తే పొడి వాతావరణలో దుమ్ము ఎంత రేగినా అంత సులువుగా వస్తువులపై దుమ్ము నిలవదు.
దుమ్ము అంటుకోదు
నీటిలో కండిషనర్ కలిపి వస్తువును శుభ్రపరిస్తే దుమ్ము, ధూళిని పూర్తిగా వదలడంతో పాటు వస్తువులపై సిల్కీ పొరను కూడా సృష్టిస్తుంది. దీనివల్ల దుమ్ము తేలికగా అంటుకోదు. మీ ఇల్లు ఒక వారం పాటు పూర్తిగా శుభ్రంగా కనిపిస్తుంది. మూలల్లో దుమ్ము పేరుకుపోకుండా ఉండేందుకు ఈ పద్ధతి వినియోగించవచ్చు.
Read Also: Garlic Benefits: వెల్లుల్లి తొక్క తీసి వాడాలా.. తీయకుండా వాడాలా..
Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..
Real Ghee vs Fake Ghee: స్వచ్ఛమైన నెయ్యికి, కల్తీ నెయ్యికి తేడాలేంటి.. గుర్తించడమెలా..