Chennai: అయోధ్య బాల రాముడికి వెండి కిరీటం
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:29 PM
అయోధ్య బాల రాముడికి చెన్నైలోని అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. ఈ మేరకు ఆ వెండి కిరీటం తయారీని సోమవారం తమిళ నూతన సంవత్సరం రోజున ప్రారంభించారు.

చెన్నై: అయోధ్య రామాలయానికి అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. ఈ మహాసభ ఆధ్వర్యంలో గత ఏడాది అయోధ్య శ్రీరాముడు(Ayodhya Sri Ramudu) ఆలయానికి 1.75 కిలోల బరువుతో తయారుచేసిన రామపాదం అందజేయగా, ప్రస్తుతం శ్రీరాముడికి 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. అనుప్పర్‌పాళయంలో తమిళ నూతన సంవత్సరం(Tamil New Year) సందర్భంగా సోమవారం కిరీటం తయారీ ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Udayanidhi: పూర్తి రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధించుకుందాం..
ఈ 26వ తేది తిరుప్పూర్ రానున్న మహాసభ జాతీయ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ నేతృత్వంలో అవినాశి లింగేశ్వర ఆలయంలో వెండి కిరీటానికి ప్రత్యేక పూజల అనంతరం అయోధ్య రామాలయానికి తరలించనున్నట్లు మహాసభ యువజన విభాగం వల్లైబాలా, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి సతీ్‌ష తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
Read Latest Telangana News and National News