ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake: భూకంపం: 95 మంది మృతి

ABN, Publish Date - Jan 07 , 2025 | 03:29 PM

Earthquake: నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్‌కు సమీపంలో భారీ భూకంపం సంభించింది. అలాగే ఆ సమీపంలోని భారత్‌లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించింది.

న్యూఢిల్లీ, జనవరి 07: నేపాల్ సరిహద్దుల్లో టిబెట్ సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 95 మంది మరణించారు. అలాగే ఇండియాలోని పలు ప్రాంతాలు.. బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్‌లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు చైనా మీడియా సంస్థ వెల్లడించింది. టిబెట్ రాజధాని లాసాకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని షిగాట్సే నగరంలోని టింగ్రి కౌంటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది.

మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో వరుసగా పలుమార్లు భూకంపం సంభవించిందని తెలిపింది. తొలుత ఉదయం 6.35కు.. ఆ తర్వాత 7.02 గంటలకు 10 కిలోమీటర్లు లోతుగా 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. ఆ కొద్ది సెకన్లకే అంటే.. 7.07 గంటలకు 30 కిలోమీటర్ల లోతులో మళ్లీ భూమి మరింతగా కంపించిందని.. ఇది 4.9 తీవ్రతతో వచ్చిందని చైనా మీడియా చెప్పింది.

హిమాలయ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తోంటాయని గుర్తు చేసింది. అయితే 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని గుర్తు చేసింది. ఈ ఘటనలో దాదాపు 9 వేల మంది మరణించారని వివరించింది. అలాగే 22 వేల మంది గాయపడ్డారని చెప్పింది. అయితే ఈ భూకంప తీవ్రతకు లక్షలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయని గుర్తు చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 03:34 PM