Share News

చిన్న పిల్లలని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి..

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:29 AM

Davangere News: దాదాపు 9 మంది ఆ ఇద్దర్నీ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు కట్టేశారు. తర్వాత చిత్రహింసలు పెట్టారు. వారి చడ్డీలలోకి ఎర్ర చీమల్ని వదిలి హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులకు కంప్లైంట్ అందటంతో నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.

చిన్న పిల్లలని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి..
National News In Telugu

దావణగెరె: ఈ మధ్య కాలంలో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని.. నేరాలకు పాల్పడ్డ వారిని శిక్షించటం బాగా పెరిగిపోయింది. తప్పు చేసిన వారిని పోలీసులకు అప్పగించకుండా.. శిక్షల పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, దొంగతనంతో పాటు అసభ్యంగా ప్రవర్తించారన్న నెపంతో ఇద్దరు చిన్న పిల్లలను దారుణంగా శిక్షించారు. చెట్టుకు కట్టేసి కొట్టడమే కాకుండా.. వారి చడ్డీలలో ఎర్ర చీమల్ని వదిలారు. ఈ సంఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకా, ఆస్తపణహళ్లికి చెందిన ఓ బాలుడు 3 నెలల క్రితం దొంగతనానికి పాల్పడ్డాడు.


దర్శన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఈ దొంగతనం చేయటంలో మరో బాలుడు సాయం చేశాడు. సాయంత్రానికి దొంగతనం చేసిన బాలుడు దొరికేశాడు. ఆ తర్వాత సాయం చేసిన బాలుడు కూడా దొరికాడు. నిందితులు ఇద్దర్నీ కూడా అక్కడి అడవుల్లోకి తీసుకెళ్లారు. చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. వారి చడ్డీలలోకి ఎర్ర చీమల్ని వదిలి హింసించారు. దాన్నంతా వీడియో తీశారు. బాగా చిత్ర హింసలు పెట్టిన తర్వాత వదిలేశారు. 3 నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దెబ్బలు తిన్న ఓ బాలుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుభాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్కీ, దర్శన్, పరసు, శివదర్శన్, హరీష్, పట్టి రాజు, భూని, సుధాన్‌ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. బాధితుడితో పాటు నిందితులు కూడా హక్కిపిక్కి జాతికి చెందిన వారే. వారంతా అడవిలోని మూలికలు అమ్మి జీవిస్తుంటారు. ఈ మధ్య కాలంలో హక్కిపిక్కి జాతికి చెందిన వారు తయారు చేసే ఆయుర్వేద హెయిర్ ఆయిల్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. నిజం చెప్పాలంటే ఈ జాతికి ఆ హెయిర్ ఆయిల్ కారణంగా మంచి గుర్తింపు వచ్చింది. సాధారణంగా హక్కిపిక్కి జాతి వారు తమలో తాము ఎంతో సామరస్యంగా ఉంటారు. అత్యంత అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.


ఇవి కూడా చదవండి:

CID షో అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ప్రద్యుమన్ ఇకలేనట్లే..

US Protest: 'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

Updated Date - Apr 06 , 2025 | 11:30 AM