Deepseek AI: జాగ్రత్త.. ఈ యాప్ మీ మొత్తం సమాచారాన్ని లాగేస్తుంది.. డీప్‌సీప్ వెబ్‌సైట్‌లో రహస్య కోడ్..
ABN, Publish Date - Feb 06 , 2025 | 08:22 AM
చాలా తక్కువ ఖర్చుతో ఛాట్ జీపీటీతో సమానమైన ఫీచర్స్‌ను అందిస్తూ తక్కువ కాలంలో సూపర్ పాపులర్ అయిన డీప్‌సీక్ యాప్‌పై ప్రపంచ దేశాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ యాప్ భద్రతా ప్రమాణాలను పాటించదని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని అనుమానిస్తున్నాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

చైనా (China) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంస్ఠ డీప్ సీక్ (Deepseek AI) యావత్ ప్రపంచాన్ని తన టెక్నాలజీతో వణికిస్తోంది. చాలా తక్కువ ఖర్చుతో ఛాట్ జీపీటీతో (ChatGPT) సమానమైన ఫీచర్స్‌ను అందిస్తూ తక్కువ కాలంలో సూపర్ పాపులర్ అయిన డీప్‌సీక్ యాప్‌పై ప్రపంచ దేశాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ యాప్ భద్రతా ప్రమాణాలను పాటించదని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని అనుమానిస్తున్నాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. డీప్‌సీక్ వెబ్‌సైట్‌లో వినియోగదారుల లాగిన్ సమాచారాన్ని ``చైనా మొబైల్`` (China Mobile) కు పంపగల కోడ్‌ను భద్రతా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.
``చైనా మొబైల్`` అనేది ఆ దేశ ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ. ఈ సంస్థకు అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే అధికారం లేదు. అయితే ఈ డీప్‌సీక్ యాప్‌ను ఇటీవల అమెరికాలో అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వ్యక్తిగత, సున్నిత వ్యాపార సమాచారాన్ని బహిర్గతం చేస్తుందని, చైనాకు నిఘా డేటాను పొందే అవకాశం కల్పిస్తుందని నిపుణులు అనుమానిస్తున్నారు. జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా చైనా మొబైల్‌ను అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) 2019లో నిషేధించింది. అప్పటి నుంచి చైనా మొబైల్ అమెరికా కార్యకలాపాలకు దూరంగా ఉంది. తాజాగా డీప్‌సీక్ వెబ్ లాగిన్ సిస్టమ్‌లో ``చైనా మొబైల్``కి లింక్ అయి ఉన్న కోడ్‌ను నిపుణులు కనుగొన్నారు.
ఉత్తర అమెరికాలో నిర్వహించిన ఈ పరీక్షల్లో డేటా బదిలీ అయినట్టు బయటపడనప్పటికీ, భవిష్యత్తులో కావాల్సిన వ్యక్తుల డేటాను చైనాకు పంపే అవకాశాన్ని నిపుణులు తోసిపుచ్చడం లేదు. కాగా, నిపుణులు ప్రస్తుతానికి వెబ్ వెర్షన్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్న డీప్‌సీక్ మొబైల్ యాప్‌పై మాత్రం ఇంకా ఎలాంటి పరిశీలనలూ జరగలేదు. డీప్‌సీక్, టిక్‌టాక్ కంటే పెద్ద ప్రమాదకారి అని, ఎందుకంటే ఏఐ ఛాట్‌బాట్‌లో వినియోగదారుల సున్నితమైన సమాచారం ఎక్కువగా ఉండవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు డీప్‌సీక్‌పై నిషేధాలకు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 06 , 2025 | 08:22 AM