Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద
ABN , Publish Date - Apr 07 , 2025 | 09:24 AM
కామంతో కళ్లు మూసుకుపోయిన వారిలో విచక్షణ నశిస్తుంది. వారి అజెండా.. మహిళలను లైగింకగా వేధించడమే. అందుకోసం ఎలాంటి నీచానికైనా దిగజారతారు.. ఎంత ధైర్యమైనా చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఎంతకు తెగించాడంటే..

బెంగుళూరు: మహిళలపై అఘాయిత్యాలను నివారించడం కోసం నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా సరే.. వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా.. భయపడకుండా రెచ్చిపోతున్నారు కామాంధులు. వయసుతో సంబంధం లేకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డు మీద ఇద్దరు యువతులను వేధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ వివరాలు..
బెంగళూరులో మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4 శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 1.32 గంటల సమయంలో ఇద్దరు యువతులు.. ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అర్థరాత్రి దాటడంతో రోడ్డు మీద ఎవరూ లేరు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఓ ఆగంతకుడు యువతులను వెంబడిస్తూ.. వారి వెంట పడ్డాడు. అంతేకాక వారిలో ఓ యువతిని పట్టుకుని.. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నించాడు. యువతిని గట్టిగా పట్టుకుని.. ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దారుణం అంతా అక్కడ సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది.
వ్యక్తి దాడితో ఒక్కసారిగా షాక్‌కు గురైన యువతులు వెంటనే తేరుకుని.. సాయం కోసం కేకలు వేశారు. దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భార్య వేధింపులు తట్టుకోలేక.. ట్రైన్‌కి ఎదురెళ్లి మరీ
Saharanpur Tragedy: ప్రియురాలి కోసం ప్రాణం తీసుకున్నాడు.. ఆమెకు కన్నీళ్లు మిగిల్చాడు..