Mallikarjun Kharge: బాబాసాహెబ్‌కు అప్పుడూ ఇప్పుడూ కూడా వాళ్లే శత్రువులు: ఖర్గే
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:42 PM
మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్‌పై గౌరవం మాటలకే పరిమితమని, ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం వారికి లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతం తీసుకున్నప్పుడు కూడా హిందూ సంస్థల నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.

న్యూఢిల్లీ: వ్యక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేస్తోందని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పార్టీ వ్యతిరేకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తిప్పికొట్టారు. మోదీ ప్రభుత్వంలో అంబేద్కర్‌పై గౌరవం మాటలకే పరిమితమని, ఆయన ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం వారికి లేదని అన్నారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా బాబాసాహెబ్‌కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శత్రువులని ప్రతి విమర్శలు గుప్పించారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఖర్గే మాట్లాడుతూ, బాబాసాహెబ్ బౌద్ధమతం తీసుకున్నప్పుడు హిందూ సంస్థల నుంచి ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.
PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ
''ఈ వ్యక్తులే గతంలోనూ ఇప్పుడూ బాబాసాహెబ్ శత్రువులు. ఆయన బతికున్నప్పుడు కూడా ఏరోజు ఆయనను సపోర్ట్ చేయలేదు. ఆయన బౌద్ధమతం తీసుకున్నప్పుడు ఈ వ్యక్తులు ఏమన్నారో మీకు తెలుసా? ఆయన అస్పృశ్యులైన మహర్ కమ్యూనిటీకి చెందిన వారుగా మాట్లాడారు. బుద్ధుడు కూడా అస్పృశ్యుడైనట్టు చెప్పారు. బాబా సాహెబ్ రాజకీయ పార్టీ పేరు రిపబ్లికన్ పార్టీ. ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించేది'' అని ఖర్గే తెలిపారు. 1952లో అంబేద్కర్‌ను ఎస్ఏ డాంగే, వీడీ సావర్కర్ ఓడించారని, ఆ విషయాన్ని అంబేద్కర్ ఒక లేఖలో పేర్కొన్నారని ఆయన తెలిపారు.
మహిళా బిల్లుపై ఖర్గే మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు నిర్దిష్ట రిజర్వేషన్లను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. రెండేళ్ల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే మా లక్ష్యం. ఇందుకోసం మేము చాలాకాలంగా పోరాడుతున్నాం. అహ్మదాబాద్ సదస్సులో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నామని ఖర్గే చెప్పారు.
ఇవి కూడా చదవండి..