Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళాలో పాల్గొననున్న సినీ తారలు.. ఎవరెవరంటే..
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:39 PM
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకలలో ఒకటైన మహాకుంభ మేళా 2025 మరో 3 రోజుల తర్వాత మొదలుకానుంది. ఈ క్రమంలో ఈ మహాకుంభ మేళాకు సామాన్య ప్రజలతో పాటు బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు కూడా రానున్నట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మహాకుంభ మేళా 2025 (Maha Kumbh Mela 2025) ఈసారి జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి చివరివారంలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరంలో జరగనున్న ఈ మహాకుంభ మేళా, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే అత్యంత విశేషమైన మతపరమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను భారీగా నిర్వహిస్తున్నారు.
లక్షలాది మంది భక్తులు
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ మహాకుంభంలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే 2025 మహాకుంభంలో అందరికీ కాకుండా ప్రముఖ వ్యక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ, నటీనటులు కూడా ఈ మహాకుంభంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈసారి మహాకుంభ మేళాలో భారీ సంఖ్యలో ప్రముఖుల హాజరుకి అంగీకారం తెపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యువ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్, నటి రాఖీ సావంత్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవ్ సహా తదితరులు ఉన్నారు. ఈ తారలు 2025 మహాకుంభ మేళాలో గంగానదిలో స్నానానికి ప్రయాగ్‌రాజ్ రానున్నారు.
అత్యంత విశిష్టమైనది
ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగు పవిత్ర స్థలాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ్ భారతదేశంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటి. అయితే వీటన్నింటిలో ప్రయాగ్‌రాజ్ మహాకుంభం అత్యంత విశిష్టమైనది. ఈ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల సంగమం ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబడుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహాకుంభానికి నిత్యం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రముఖుల కోసం ప్రత్యేక శిబిరాలు
ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా ఈసారి మరింత విశిష్టంగా ఉండబోతున్నది. అందులో ప్రముఖులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా వీరికి అధిక స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సౌకర్యవంతమైన ఆహారం, నిద్ర, సంరక్షణ, భద్రత వంటి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కావడంతో భద్రతా చర్యలు అత్యంత సవాలుగా తీసుకుంటున్నారు. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో పలు భద్రతా బృందాలు, ఫాస్ట్-మొబైల్ యాప్స్, 24/7 హెల్ప్‌లైన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రవాణా, ట్రాఫిక్, రద్దీ నిర్వహణ, భద్రత కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 09 , 2025 | 02:41 PM