Bus fares: బస్సు చార్జీలు పెంచేశారు బాబోయ్..
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:26 PM
శక్తి గ్యారెంటీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం ఇతరుల ప్రయాణాలపై భారం మోపింది. రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లు ప్రస్తావించిన ఛార్జీల పెంపుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- మంత్రివర్గం ఆమోదం
- నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎంపిక నిర్ణయం సీఎందే..
బెంగళూరు: శక్తి గ్యారెంటీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం ఇతరుల ప్రయాణాలపై భారం మోపింది. రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లు ప్రస్తావించిన ఛార్జీల పెంపుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విధానసౌధలో గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 23 అంశాలపై చర్చలు జరిపిన కేబినెట్ అన్నింటినీ ఆమోదం తెలిపినట్లు శానససభా వ్యవహారాలు, న్యాయశాఖా మంత్రి హెచ్‌కే పాటిల్(Minister HK Patil) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Bangalore: రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు
మీడియాకు కేబినెట్ నిర్ణయాలను వివరించారు. నాలుగు రవాణా కార్పొరేషన్‌లు బస్సు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించారని అందుకు అనుగుణంగా 15శాతంకు ఆమోదం తెలిపామన్నారు. ఆర్టీసీ సంస్థలు చేసే అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేలా తీర్మానించామన్నారు. ఇకపై ఆర్టీసీ సంస్థలు చేసే రుణాలకు ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వనుందన్నారు. హుబ్బళ్ళి- ధారవాడ(Hubballi- Dharawada) జంట నగరాలకు కలిపి ఒక్కటిగానే ఉండే మహానగర పాలికెను రెండుగా విభజిస్తూ తీర్మానించారు.
ఒకటవ వార్డు నుంచి 26వ వార్డు దాకా ధారవాడ మహానగర పాలికెగాను 27 నుంచి 82వ వార్డు దాకా హుబ్బళ్ళి మహానగర పాలికెగాను విభజించారు. ఇకపై రెండు వేర్వేరు కార్యాలయాలతో పాటు ఇతరత్రా సౌలభ్యాలను విభజించే ప్రక్రియ త్వరలోనే జరుపనున్నట్లు తెలిపారు. విధానపరిషత్ సభ్యుడు కెహెచ్ తిప్పేస్వామి పదవీకాలం ముగిసిన మేరకు నామినేటెడ్(Nominated) విధానంతో ఒకరిని ఎంపిక చేసే నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కే అప్పగిస్తూ మంత్రులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
అయితే ఎవరిని ఎంపిక చేయాలనేది త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. పారిశ్రామిక వాడల అభివృద్ది కోసం భూముల సేకరణతో పాటు ఇతరత్రా సౌలభ్యాల సమకూర్చేందుకు ప్రస్తుతం ఉండే రూ.500 కోట్ల రుణ పరిమితిని ఏకంగా పదింతలు పెంచామని ఇకపై ఐదువేల కోట్ల దాకా వెసలుబాటుకు ఆమోదించామన్నారు. రాష్ట్రంలో గోశాలలు అభివృద్దితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న గోశాలలు మరిన్ని సౌలభ్యాలు కల్పించేందుకు రూ.10.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 12:26 PM