Share News

Chhattishgarh: బిజాపూర్‌లో 5 ఐఈడీలు స్వాధీనం... భద్రతా బలగాలకు తప్పిన భారీ ముప్పు

ABN , Publish Date - Apr 14 , 2025 | 06:18 PM

ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని చెప్పారు.

Chhattishgarh: బిజాపూర్‌లో 5 ఐఈడీలు స్వాధీనం... భద్రతా బలగాలకు తప్పిన భారీ ముప్పు

బిజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన 5 ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ (IED)లను భద్రతా బలగాలు సోమవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. దీంతో భద్రతా బలగాలకు భారీ ముప్పు తప్పింది. మాంకెలి గ్రామం సమీపంలో డర్ట్ ట్రాక్‌పై ఈ ఐఈడీలు కనిపించాయి.

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్


ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని, బీర్ బాటిళ్లలో వాటిలో అమర్చారని చెప్పారు. మరో రెండు ఐఈడీలు 3, 5 కిలోల చొప్పున స్టీల్ టిఫెన్స్ బాక్సుల్లో అమర్చి ఉన్నట్టు తెలిపారు. భూమికి 3 నుంచి 5 మీటర్ల లోపల వీటిని అమర్చి కమాండ్ స్విచ్ మెకానిజంతో పేల్చేస్తారని, భద్రతా బలగాలను టార్గెట్‌గా చేసుకుని వీటిని అమర్చారని ఆయన చెప్పారు. సకాలంలో వీటిని కనుగొనడంతో బలగాలకు భారీ ప్రమాదం తప్పిందని వివరించారు.


బస్తర్‌లోని రిమోట్ ఏరియాల్లో పెట్రోలింగ్ చేసే భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని రోడ్లు, అటవీ మార్గాల్లో ఈ ఐఈడీలను మావోయిస్టులు తరచు అమరుస్తుంటారు. అయితే వీటివల్ల భద్రతా బలగాలే కాకుండా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గతంలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు


ఇవి కూడా చదవండి..

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 14 , 2025 | 05:43 PM

Updated Date - Apr 14 , 2025 | 06:26 PM