Naxal Surrender Surge: ఛత్తీస్‌గఢ్‌లో 3 నెలల్లో 280 నక్సల్స్ లొంగుబాటు
ABN, Publish Date - Mar 31 , 2025 | 03:27 AM
ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో 280 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2024లో మొత్తం 787 మంది నక్సలైట్లు జనప్రవాహంలో చేరారు. సీఆర్‌పీఎఫ్ 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్‌లతో నక్సల్స్ పట్ల చర్యలు చేపట్టి, వారు ఆయుధాలను విడిచేందుకు ఒప్పించారు
న్యూఢిల్లీ, మార్చి 30: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 280 మంది నక్సలైట్లు, జన్ మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఇక, 2024లో ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 787 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. నక్సల్స్ ఆయుధాలను వీడేలా సంప్రదింపులు జరిపి, ఒప్పించడంలో సీఆర్‌పీఎఫ్ నిఘా విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది.ఛత్తీస్‌గఢ్‌లో 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్‌తో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్ కీలకంగా ఉంది.
Updated Date - Mar 31 , 2025 | 03:27 AM