Yogi Adityanath: ఐక్యంగా ఉంటే దేశాన్ని ఏ శక్తీ ఆపలేదు.. యోగి హోలీ సందేశం

ABN, Publish Date - Mar 14 , 2025 | 07:54 PM

ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్‌ అభివృద్ధిని అడ్డుకోలేదని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

Yogi Adityanath: ఐక్యంగా ఉంటే దేశాన్ని ఏ శక్తీ ఆపలేదు.. యోగి హోలీ సందేశం

గోరఖ్‌పూర్: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ కూడా మన దేశం అభివృద్ధి చెందకుండా ఆపలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పిలుపునిచ్చారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ప్రజల మధ్య హోలీ పండుగను ఆయన ఎంతో ఉత్సాహంగా జరుపుకొన్నారు. గోరఖ్‌నాథ్ ఆలయ సముదాయంలోని హోలికా దహన్ స్థలంలో పూజ, హారతి నిర్వహించిన అనంతరం హోలీ వేడుకలను ఆయన ప్రారంభించారు.

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ


జాతీయ సమైక్యత అవసరాన్ని ఈ సందర్భంగా యోగి ప్రస్తావిస్తూ, వందలాది సంవత్సరాలు మన దేశం బానిసత్వంలో మగ్గిందని, దేశంపై దండెత్తి వచ్చిన ముష్కరులు మన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. హోలి, దీపావళి, మహాకుంభ్ వంటి ఈవెంట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శక్తులను కూడా మనం చూశామని, అయినప్పటికీ ఏ ఒక్కరూ మన సంప్రదాయాలను అడ్డుకోలేకపోయారని అన్నారు. పండుగల పరంపరం, సాంప్రయాదాలు కొనసాగుతూనే వస్తున్నాయని చెప్పారు.


సనాతన ధర్మం అనేది కులం, మతం, ప్రాంతం, తెగల వారిగా విడిపోయిందంటూ ప్రచారం చేసిన వాళ్లకు మహాకుంభ్ గట్టి సమాధానం ఇచ్చిందని యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఈరోజు (హోలీ) సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొంటున్నారని, ఇదీ మనకున్న బలం అని ఆయన సామాజిక మాధ్యమంలో ఆయన 'ట్వీట్' చేశారు. ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్‌ అభివృద్ధిని అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. మన శక్తియుక్తులన్నీ దేశానికి అంకితం చేయాలని పిలిపునిచ్చారు. ఐక్యత ద్వారానే భారతదేశం సమైక్యంగా మనగలుగుతుందన్నదే హోలీ పండుగ మనకు ఇచ్చే సందేశం అని యోగి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Updated Date - Mar 14 , 2025 | 07:55 PM