Share News

Summer: ఇక.. మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:29 PM

మే నెల సమీపిస్తున్న తరుణంలో ఇక.. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు పెరుగనున్న దృష్ట్యా పిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, అత్యవసర పనులను తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

Summer: ఇక.. మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
Summer Weather

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. అయితే.. 10 జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా, నీలగిరి(Neelagiri), కోవై, తిరుప్పూర్‌, తేని, దిండుగల్‌, తెన్‌కాశి, విరుదునగర్‌, తిరునల్వేలి, కన్నియాకుమారి(Kanyakumari), తూత్తుకుడి తదితర జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఈనెల 19వ తేది వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురవనుంది.

ఈ వార్తను కూడా చదవండి: BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం


అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగనున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. చెన్నై, వేలూరు, కరూర్‌(Chennai, Vellore, Karur) సహా పలు జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్‍కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు పెరుగనున్న దృష్ట్యా పిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, అత్యవసర పనులను తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2025 | 12:41 PM