Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:49 PM
Delhi Woman Roller Coaster Tragedy: కాబోయే భర్తతో ఎంజాయ్ చేద్దామని ప్రియాంక వాటర్ పార్కుకు వచ్చింది. ఇద్దరూ రోలర్ కోస్టర్ ఎక్కారు. రోలర్ కోస్టర్ గాల్లో ఉండగా.. అనుకోని సంఘటన చోటుచేసుకుంది. పాపం.. ప్రియాంక ప్రాణాలు పోగొట్టుకుంది.

మరణం ఎప్పుడు? ఎలా? మనల్ని చేరుకుంటుందో అస్సలు ఊహించలేము. కాలం చెల్లి పోయినపుడు చీమ కుట్టినా ప్రాణం పోతుంది. పాపం.. ఓ యువతి మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి, భర్తతో జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉంది. ఇలాంటి సమయంలో విషాదం చోటుచేసుకుంది. అర్థాంతరంగా ఆమె జీవితం ముగిసింది. ఎంజాయ్ చేద్దామని వెళితే.. ప్రాణమే పోయింది. సరదా కోసం ఎక్కిన రోలర్ కోస్టర్ కారణంగా యువతి చనిపోయింది. కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తున్నపుడే ఇదంతా జరిగింది. అతడి కళ్ల ముందే ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఢిల్లీలోని కాపషేరలో శనివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కాపషేరాకు చెందిన 24 ఏళ్ల ప్రియాంకకు అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. మరికొన్ని నెలల్లో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే కాబోయే భార్యాభర్తలు వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఇద్దరూ అమ్యూజ్‌మెంట్ పార్కుకు వెళ్లారు. కొన్ని గంటల పాటు ఎంజాయ్ చేశారు. చివరగా రోలర్ కోస్టర్ ఎక్కారు. అది రన్నింగ్‌లో ఉండగానే ఆమె కూర్చున్న స్టాండ్ విరిగిపోయింది. ప్రియాంక పైనుంచి కిందపడిపోయింది. బలంగా నేలను తాకటంతో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
వెంటనే ఆమెను మనిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రియాంక శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగిందా అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు. ఈ సంఘటనపై ప్రియాంక చెల్లెలు మాట్లాడుతూ.. ‘ గత ఫిబ్రవరి నెలలో మా చెల్లెలికి నిఖిల్‌లో పెళ్లి నిశ్చయం అయింది. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ఉంది. నిఖిల్ రమ్మంటే వాటర్ పార్కుకు వెళ్లింది’ అంటూ కంటతడి పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..
170 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంత్ అంబానీ..