Ravindra Puri: వాళ్లు ఉమ్ములేస్తారు.. మూత్రం పోస్తారు!
ABN, Publish Date - Jan 02 , 2025 | 05:36 AM
ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 13 నుంచి ప్రారంభంకానున్న మహాకుంభమేళాలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురీ డిమాండ్ చేశారు.
అందుకే హిందూయేతరులకు షాపులు వద్దు
మహాకుంభమేళాలో దుకాణాల కేటాయింపుపై అఖాడా పరిషత్ చీఫ్ రవీంద్ర వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్, జనవరి 1: ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 13 నుంచి ప్రారంభంకానున్న మహాకుంభమేళాలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురీ డిమాండ్ చేశారు. ఈ మహాక్రతువును పవిత్రంగా, పరిశుభ్రంగా నిర్వహించాలంటే వారికి దుకాణాలు కేటాయించకూడదని ఆయన పట్టుబట్టారు. ‘‘వాళ్లు ఎక్కడబడితే అక్కడ ఉమ్ములేస్తారు.. మూత్రం పోస్తారు.
పవిత్ర మహాకుంభమేళా అపవిత్రం అయిపోతుంది. అందుకే అలాంటి వారికి దుకాణాలు కేటాయించరాదని మా నాగా సాధువుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని రవీంద్ర పురీ వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 02 , 2025 | 05:36 AM