Collector: వడ్డీవ్యాపారుల బెదిరింపులకు.. ఊరు వదలొద్దు
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:18 PM
మైక్రో ఫైనాన్స్(Micro Finance) వడ్డీవ్యాపారుల బెదిరింపులకు భయపడవద్దని, ఎవరూ గ్రామాలను వీడి వెళ్లకండి అంటూ చామరాజనగర జిల్లా అధికారి శిల్పానాగ్(Chamarajanagar District Officer Shilpanag) ప్రకటించారు.
- అండగా ఉంటాం: చామరాజనగర జిల్లా అధికారి
బెంగళూరు: మైక్రో ఫైనాన్స్(Micro Finance) వడ్డీవ్యాపారుల బెదిరింపులకు భయపడవద్దని, ఎవరూ గ్రామాలను వీడి వెళ్లకండి అంటూ చామరాజనగర జిల్లా అధికారి శిల్పానాగ్(Chamarajanagar District Officer Shilpanag) ప్రకటించారు. జిల్లాలో వందమందిదాకా గ్రామాలను వీడి పరారీలో ఉన్నట్లు ప్రచారం సాగడంపై జిల్లా అధికారి స్పందించారు. ఎవరూ ఊళ్లు వీడరాదని, అందరికీ అండగా ఉంటామన్నారు. జిల్లా అధికారి, తహసీల్దార్, గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడ ఫిర్యాదు చేసినా పోలీసులు బాధితులకు సాయం చేస్తారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
సమగ్ర నివేదిక ఇవ్వాలని, నలుగురు అధికారులను నియమించామన్నారు. గ్రామాలవారీగా సభలు జరుపుతామన్నారు. మైక్రోఫైనాన్స్ కంపెనీల(Microfinance companies) నిర్వహణపై పరిశీలిస్తామన్నారు. ఎంతమంది ఊళ్లనుంచి పరారీ అయ్యారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది గ్రామాలవారీగా పరిశీలిస్తామన్నారు. ఎవరూ భార్యాపిల్లలను వీడి వెళ్లరాదని సూచించారు.
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 11 , 2025 | 12:18 PM