Share News

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 09:16 PM

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

ఖాట్మండు: నేపాల్‌ (Nepal)లో శుక్రవారం సాయంత్ర స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదని తెలిపింది. కాగా, ఉత్తర భారత్‌ను ఈ ప్రకంపనలు తాకాయని, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలు చోట్ల భూప్రంపకనలు చోటుచేసుకున్నాయని ప్రకటించింది.

Stolen Smartphones: రైల్లో మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా, వెంటనే ఇలా చేయండి.. సరికొత్త సౌకర్యం..


మార్చి 23న పెనుభూకంపం మయన్మార్‌ను కుదిపేసిన క్రమంలో నేపాల్‌లో తాజా భూకంపం సంభవించింది. మయన్మార్‌లో 7.7 తీవ్రతో సంభవించిన భారీ విలయంలో 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4,500 మంది గాయపడ్డారు. 341 మంది జాడ గల్లంతైంది. పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 09:30 PM