Engineering Books in 12 Languages: 2026 కల్లా 12 భాషల్లో ఇంజనీరింగ్‌ పుస్తకాలు

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:43 AM

2026 వరకు 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఏఐసీటీఈ ప్రణాళికను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 600 పుస్తకాలు అనువదించి, తెలుగు సహా 12 భాషల్లో అప్‌లోడ్‌ చేశారు

Engineering Books in 12 Languages: 2026 కల్లా 12 భాషల్లో ఇంజనీరింగ్‌ పుస్తకాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: అన్ని ఇంజనీరింగ్‌ డిప్లోమా, డిగ్రీ కోర్సుల పుస్తకాలను 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిష్ఠాత్మక ప్రణాళికపై ఏఐసీటీఈ కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకు 2026 డిసెంబరును డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారాం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ డిప్లోమా, డిగ్రీ కోర్సుల మొదటి, రెండవ సంవత్సరాల కోసం 600 పుస్తకాలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, వాటిని తెలుగు సహా 12 ప్రాంతీయ భాషల్లో అప్‌లోడ్‌ చేశామని పేర్కొన్నారు. 3, 4 సంవత్సరాలకు సంబంధించిన అనువాద పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనువాద ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐసీటీఈ ఏఐని వినియోగిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 05:43 AM