Fake Doctor: నకిలీ డాక్టర్..ఆపరేషన్లు చేస్తాడు.. ప్రాణాలు తీస్తాడు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:16 PM
Fake Doctor: డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర ఇప్పటి వరకు 15 సర్జరీలు చేశాడు. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే 7 మంది చనిపోయారు. పోలీసులు డాక్టర్ జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఓ నకిలీ డాక్టర్ యుముడిలా మారాడు. తన రోగుల్లో 7 మందిని బలి తీసుకున్నాడు. వారిలో మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉండటం గమనార్హం. ఛత్తీష్‌ఘర్ మాజీ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు 2006 సంవత్సరంలో గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ని బిలాస్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ జాన్ కామ్ ఆయనకు సర్జరీ చేశారు. సర్జరీ వికటించటంతో రాజేంద్ర ప్రసాద్ చనిపోయారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఆపరేషన్ చేసిన డాక్టర్ జాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. డాక్టర్ జాన్ నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర చనిపోయారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మధ్య ప్రదేశ్, దామోలోని మిషన్ ఆస్పత్రిలో గత కొన్ని నెలల నుంచి వరుసగా రోగులు చనిపోతూ ఉన్నారు. వారంతా గుండె సర్జరీ నేపథ్యంలోనే చనిపోయారు.
వరుస మరణాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అతడి ఆధార్ కార్డు పరిశీలించగా.. అందులో అతడి పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని ఉంది. డాక్టర్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్‌బీబీఎస్.. డార్జిలింగ్, కోల్‌కతా, యూకేలనుంచి కార్డియాలజీలో పలు డిగ్రీలు పొందాడు. అవన్నీ ఫేక్ అని తేలింది. ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా డాక్టర్‌గా విధుల్లో చేరాడు. ఆ ఏజెన్సీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందింది.
50 శాతం జీతం ఏజెన్సీకి ఇచ్చే ఒప్పందంతో అతడు డాక్టర్‌గా మారాడు. దాదాపు 20 ఏళ్లనుంచి గుండె రోగులకు చికిత్స అందిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు అతడు 15 సర్జరీలు చేశాడు. వీరిలో 7 మంది చనిపోయారు. డాక్టర్ జాన్ ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే రోగులు చనిపోయారు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర దొంగతనాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని పోర్టబుల్ ఎకో మిషన్‌ను అతడు దొంగలించాడట. దాని విలువ 5నుంచి 7 లక్షల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కూడా పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది. దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Dearness Allowance: ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై ఏడాదికి రెండు సార్లు డీఏ
Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..