ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం.. ఆందోళన పడితే ఎలా..

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:24 PM

రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎవరైనా ఎదుర్కొనక తప్పదని విందు నిర్వహిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి(Minister Satish Jarkiholi) ప్రశ్నించారు.

బెంగళూరు: రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎవరైనా ఎదుర్కొనక తప్పదని విందు నిర్వహిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి(Minister Satish Jarkiholi) ప్రశ్నించారు. గురువారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు విందు ఏర్పాటు చేసుకుంటే ఆందోళన ఎందుకన్నారు. మేం సమన్వయంగా కలసి భోజనం చేయదలిచామని, మా అజెండా ప్రకారం చర్చలు జరుపుకొంటామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP MLC: లొంగిపోయిన మావోలను సమగ్రంగా విచారించాలి


ఇతరులకు భయమెందుకన్నారు. సభ ఏ ఉద్దేశంతో ఆహ్వానిస్తున్నారో తనకు తెలియదని, తనను పిలిచారన్నారు. వారు ఏ అంశాలపై చర్చించేది ముందుగా తెలపలేదన్నారు. విందులో పాల్గొన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే ఆందోళన సరికాదన్నారు. డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) అయినా, ఇతరులైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి భేటీలకు అధిష్ఠానంతో చర్చించి అమలు చేస్తామన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి వెనుక ముందు, గెలుపోటములు పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.


కానీ ప్రజా సమస్యలపై నిరంతరంగా ఆలోచించక తప్పదన్నారు. ఒక్కసారి మేం ఓడిపోయామని అంతమాత్రాన కుంగిపోతామా అన్నారు. కేపీసీసీ అధ్యక్షుడికి సంబంధించి అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. సభ జరిపి తీర్మానిస్తుందన్నారు. తాను రాజకీయాల్లో కేంద్రబిందువు కాదన్నారు. తన పనులు తాను చేసుకుంటూ పోతానన్నారు. అయితే కేంద్ర బిందువుగా మారితే తానేం చేయలేనన్నారు. ఎప్పుడు ఎలా ఉండాలో అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తానన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 01:24 PM