Share News

Akash Anand: నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

ABN , Publish Date - Apr 13 , 2025 | 09:18 PM

తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.

Akash Anand:  నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బహిష్కృత నేత, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ (Akash Anand) తన తప్పులు ఒప్పుకున్నారు. తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అదివారం వరుస ట్వీట్లు చేశారు.

Tamil Nadu: జైశ్రీరామ్ అనండి.. మరో వివాదంలో తమిళనాడు గవర్నర్


"నా పొరపాట్లు మన్నించమని ఆమెను కోరుతున్నాను. పార్టీలో తిరిగి పనిచేసే ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను. అందుకు ఆమెకు సర్వదా కృతజ్ఞతతో ఉంటాను. పార్టీ ఆత్మ గౌరవం దెబ్బతినే ఎలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయనని వాగ్దానం చేస్తున్నాను. మాయావతి ఆదేశాలను తూ.చ.తప్పకుండా పాటిస్తాను. ఇంకెవ్వరి సలహాలు నాకు అవసరం లేదు. బీఎస్‌పీలోని సీనియర్లకు విధేయతగా ఉంటూ వారి నుంచి తెలియని విషయాలు నేర్చుకుంటాను" అని ఆ ట్వీట్లలో ఆయన విజ్ఞప్తి చేశారు.


ఆకాష్‌పై ఎందుకు బహిష్కరణ వేటు పడింది?

మాయావతి సోదరుడైన ఆనంద్ కుమార్ తనయుడే ఆకాష్ ఆనంద్. మాయావతి దగ్గరే పెరిగారు. 2017లో ఆకాష్‌ను తన రాజకీయ వారసుడిగా భావించి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. 2019లో పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా మాయావతి నియమించారు. 2023 డిసెంబర్‌లో ఆయనను తన రాజకీయ వారసుడిగా కూడా మాయావతి ప్రకటించారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఆకాష్ తన మామగారైన అశోక్ సిద్ధార్ధతో కలిసి పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం సాగించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిధుల సేకరణ, వ్యూహాలు రూపొందించడం చేశారు. ఈ క్రమంలో మాయావతికి అత్యంత విశ్వసనీయుడని పేరున్న రామ్జీ గౌతమ్ సహా పలువురు నేతలను ఆకాష్ ఆయన మామగారు కలిసి పక్కనపెట్టేశారు. పార్టీలో రెండు గ్రూపులు తయారయ్యాయి. ఒకటి మాయావతికి సన్నిహితులుగా ఉండేవారు, మరొకటి ఆకాశ్ ఆనంద్‌కు సన్నిహితులుగా ఉండేవారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ దారుణంగా చతికిలపడటంతో మాయావతి విధేయులు ఆకాష్ ఆనంద్, అశోక్ సిద్ధార్ధ పాత్ర, పార్టీ నిధుల దుర్వినియోగంపై ఆమెకు వివరించారు. గత ఫిబ్రవరిలో సమీక్షా సమావేశానంతరం పార్టీ నుంచి అశోక్ సిద్ధార్ధను బహిష్కరిస్తూ మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆకాష్ ఆనంద్‌ను సైతం పార్టీ నుంచి బహిష్కరించారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ మరో తనయుడు, మేనల్లుడు అయిన ఇషాన్ ఆనంద్‌ను గత జనవరి 15న తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీలోకి మాయావతి ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Viral Video: పాపం పసివాడు.. అన్నను కాపాడుకోవడం కోసం

Manish Gupta: ఢిల్లీ సీఎం భర్తపై ఆరోపణలు..బీజేపీ రియాక్షన్ ఎలా ఉందంటే..

Updated Date - Apr 13 , 2025 | 09:20 PM