Girija Vyas: హారతి అంటుకుని గాయపడిన గిరిజా వ్యాస్
ABN, Publish Date - Mar 31 , 2025 | 06:46 PM
79 ఏళ్ల గిరిజా వ్యాస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు.

జైపూర్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్ (Girija Vyas) సోమవారంనాడు ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సోమవారంనాడు తన నివాసంలో పూజ చేస్తుండగా హారతి అంటుకోవడంతో ఆమె గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అనంతరం అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ
పూజ సమయంలో హారతి ఇస్తుండగా కిందనే ఉన్న దీపంపై దుప్పటా పడి మంటలు అంటుకున్నట్టు గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ తెలిపారు. గిరిజా వ్యాస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యురాలు హితాంషి శర్మ చెప్పారు. గిరిజా వ్యాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు పలువురు పేర్కొ్న్నారు. డాక్టర్ గిరిజా వ్యాస్ ప్రమాదం జరిగిన సమాచారం ఆందోళన కలిగించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు. 79 ఏళ్ల గిరిజా వ్యాస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్
వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
For National News And Telugu News
Updated Date - Mar 31 , 2025 | 06:48 PM